rohit sharma half century
-
IND VS NZ 2nd ODI: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
3 వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 13 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లు వికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. -
డీకే తిట్టుకున్న బ్యాట్‌తో రోహిత్ దంచి కొట్టాడు..
ముంబై: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ కెరీర్లో మొట్టమొదటి అర్ధ శతకాన్ని తనకు కలిసిరాని బ్యాట్‌తో సాధించాడని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. మంగళవారం(జూన్ 1న) 36వ జన్మదినాన్ని జరుపుకున్న డీకే.. ఈ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో తాను తిట్టుకుని, వద్దనుకున్న బ్యాట్‌తో రోహిత్ అద్భుతంగా రాణించాడని, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ తొలి అర్థసెంచరీ తన బ్యాట్ నుంచి జాలువారడాన్ని తలచుకుంటే ఇప్పటికీ గర్వంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా 116/9కే పరిమితమైంది. 50 పరుగలతో నాటౌట్‌గా నిలిచిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, అదే మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. పొలాక్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే మోర్కెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూముకి వచ్చిన డీకే.. తనకు ఆ బ్యాట్ కలిసి రావడం లేదని తిట్టుకున్నాడట. ఆ సమయంలో పక్కనే ఉన్న రోహిత్.. డీకేను ఆ బ్యాట్ ఇవ్వల్సిందిగా కోరి, అదే బ్యాట్‌తో హాఫ్ సెంచరీ బాదినట్లు డీకే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాగా, రోహిత్ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్.. -
అర్ధ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్లు
సాక్షి, ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీలు సాధించారు. తొలుత రోహిత్ శర్మ 42 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించగా అనంతరం రహానే కూడా 50 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు కెరీర్లో ఇది 33వ అర్ధ సెంచరీ కాగా రహానేకు 21వ అర్ధ సెంచరీ. అయితే 19 ఓవర్లకు భారత్ స్కోరు 126/0 FIFTY! @ImRo45 brings up his 33rd ODI 50 Paytm #INDvAUS pic.twitter.com/8dAGd96PJz — BCCI (@BCCI) 24 September 2017 .@ajinkyarahane88 celebrates as he brings up his Fifty. This is his 21st in ODIs #INDvAUS pic.twitter.com/8GuTuRLVQn — BCCI (@BCCI) 24 September 2017 -
రోహిత్ శర్మ అర్ధసెంచరీ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో లంకపై టీమిండియాకు 243 పరుగుల ఆధిక్యం దక్కింది. 21/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కోహ్లి సేన ఆచితూచి ఆడింది. కెప్టెన్ కోహ్లి(21) తొందగానే అవుటైనా స్టువర్ట్ బిన్నీతో కలిసి రోహిత్ శర్మ పోరాడాడు. రోహిత్ అర్ధ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికిది 4వ హాఫ్ సెంచరీ. బిన్నీ 38, ఓజా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.