కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో లంకపై టీమిండియాకు 243 పరుగుల ఆధిక్యం దక్కింది. 21/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కోహ్లి సేన ఆచితూచి ఆడింది.
కెప్టెన్ కోహ్లి(21) తొందగానే అవుటైనా స్టువర్ట్ బిన్నీతో కలిసి రోహిత్ శర్మ పోరాడాడు. రోహిత్ అర్ధ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికిది 4వ హాఫ్ సెంచరీ. బిన్నీ 38, ఓజా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
రోహిత్ శర్మ అర్ధసెంచరీ
Published Mon, Aug 31 2015 12:27 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM
Advertisement
Advertisement