శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీసుకున్నాడు.
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్ స్థానంలో మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన నవాబ్ ప్రదీప్ స్థానంలో దుషమంత చమేరాను జట్టులోకి తీసుకున్నారు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.