Colombo Test
-
రోహిత్ శర్మ అర్ధసెంచరీ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ నాలుగో రోజు లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో లంకపై టీమిండియాకు 243 పరుగుల ఆధిక్యం దక్కింది. 21/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కోహ్లి సేన ఆచితూచి ఆడింది. కెప్టెన్ కోహ్లి(21) తొందగానే అవుటైనా స్టువర్ట్ బిన్నీతో కలిసి రోహిత్ శర్మ పోరాడాడు. రోహిత్ అర్ధ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. టెస్టుల్లో అతడికిది 4వ హాఫ్ సెంచరీ. బిన్నీ 38, ఓజా 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. -
నిరాశపరిచిన విజయ్, రహానే
కొలంబో: శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 12 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా నిలబడ్డారు. మూడో వికెట్ కు వీరిద్దరూ 85 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. కోహ్లి 48, రాహుల్ 39 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు. అజింక్య రహానే(4) మరోసారి నిరాశపరిచాడు. వీరిద్దరినీ ప్రసాద్ అవుట్ చేశాడు. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్ స్థానంలో మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చారు. శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన నవాబ్ ప్రదీప్ స్థానంలో దుషమంత చమేరాను జట్టులోకి తీసుకున్నారు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
'ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తా'
కొలంబో: తన చివరి టెస్టులో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర వెల్లడించాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తమ టీమ్ ను గెలిపించేందుకు తనవంతు పాత్ర పోషించడంపైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అయితే ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోలేదన్నాడు. చివరి టెస్టులో సెంచరీ చేయాలకుని తనకు తానుగా ఒత్తిడికి గురికాబోనని చెప్పాడు. టీమిండియాను సమర్థవంతంగా ఎదుర్కొవడంపైనే దృష్టి నిలిపానన్నాడు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లి సేన అనూహ్యంగా ఓటమిపాలైందని, టెస్టు క్రికెట్ సవాల్ తో కూడుకున్నదనడానికి ఇదే నిదర్శమని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం తనకు కష్టంగానే ఉందని అన్నాడు. చివరి టెస్టు తనకు భావోద్వేగంతో కూడుకున్నదేనన్నాడు. తన టీమ్ మేనేజ్ మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పూర్తి చేశానన్నాడు. రిటైర్ తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించాడు. తనకు ఇచ్చిన అవకాశాలకు శ్రీలంకకు కృతజ్ఞుడినై ఉంటానని సంగక్కర ప్రకటించాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.