Photo: IPL Twitter
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఎట్టకేలకు హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్ నిరీక్షణకు తెరదించాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రోహిత్ మునుపటి ఫామ్‌ను గుర్తుచేస్తూ చెలరేగాడు.
ముఖ్యంగా నోర్ట్జే 150 కిమీవేగంతో వేసిన బంతిని తన ట్రేడ్‌మార్క్ సిక్సర్‌తో మెరిశాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో రోహిత్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే రోహిత్ ఓపెనర్‌గా ఫిఫ్టీ సాధించి రెండేళ్లు అయిపోయింది. చివరగా 2021 ఐపీఎల్ సీజన్‌లో అర్థసెంచరీ మార్క్ సాధించిన రోహిత్‌కు మళ్లీ అర్థసెంచరీ సాధించడానికి 24 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి.
ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఒక అర్థసెంచరీకి ఎక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ తర్వా మయాంక్ అగర్వాల్(2011-15) 21 ఇన్నింగ్స్‌లు, మురళీ విజయ్(2014-16) 20 ఇన్నింగ్స్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment