IPL 2023, DC Vs MI: Abishek Porel Pulls Off A One-Handed Stunner To Dismiss Rohit Sharma, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: అభిషేక్‌ సంచలన క్యాచ్‌.. రోహిత్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్‌

Published Wed, Apr 12 2023 12:03 PM | Last Updated on Wed, Apr 12 2023 1:30 PM

Abishek Porels onehanded stunner sends Rohit Sharma - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ అభిషేక్ పోరెల్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌తో పోరెల్‌ పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన ముస్తిఫిజర్‌ రెహ్మన్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి థిక్‌ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ అభిషేక్ పోరెల్ తన కుడివైపు డైవ్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడు క్యాచ్‌ అందుకున్న విధానాన్ని చూసిన రోహిత్‌ ఆశ్చర్యపోయాడు. కీలక సమయంలో ఔట్‌ కావడంతో హిట్‌మ్యాన్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఢిల్లీ కెప్టె్‌న్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో బెంగాల్‌కు చెందిన అభిషేక్‌ పోరల్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ యవ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో భాగమయ్యే ఛాన్స్‌ వచ్చింది.
చదవండి: IPL 2023: ఏం చేస్తున్నావు.. లలిత్‌పై కోపంతో ఊగిపోయిన వార్నర్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement