
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. హిట్‌మ్యాన్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఢిల్లీపై 33 మ్యాచ్‌లు ఆడిన రోహిత్..977 పరుగులు సాధించాడు. రోహిత్ దక్కన్ ఛార్జర్స్(ఎస్‌ఆర్‌హెచ్), ముంబై ఇండియన్స్ తరపున ఆడి ఈ ఫీట్ నమోదు చేశాడు.
అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. ఇప్పటివరకు ఢిల్లీపై 26 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 925 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ,.. కింగ్ కోహ్లి రికార్డు బ్రేక్ చేశాడు. ఇక కోహ్లి తర్వాతి స్థానంలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే 792 పరుగులతో ఉన్నారు.
చదవండి: IPL 2023: అభిషేక్ సంచలన క్యాచ్.. రోహిత్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్