IPL 2023, DC vs MI: Rohit Sharma relieved after Mumbai Indians first win - Sakshi
Sakshi News home page

IPL 2023: మా విజయానికి కారణం అదే.. అతడొక యువ సంచలనం! వారికి మరిన్ని..

Published Wed, Apr 12 2023 10:28 AM | Last Updated on Wed, Apr 12 2023 10:48 AM

Rohit Sharma relieved after Mumbai Indians'first win - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో వరుస అపజయాలకు ముంబై ఇండియన్స్‌ చెక్‌ పెట్టింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్‌లో తమ తొలి విజయంపై మ్యాచ్‌ అనంతరం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఈ విజయం తమకు ఎంతో కీలకమైనది అని రోహిత్‌ తెలిపాడు.

పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో రోహిత్‌ మాట్లాడుతూ.. "కీలకమైన మ్యాచ్‌లో గెలవడం మేము గెలవడం చాలా సంతోషంగా ఉంది. తొలి విజయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ విజయం కోసమే మేము తొలి మ్యాచ్‌ నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాం. ఈ మ్యాచ్‌కు ముందు మేము ముంబైలో ఒక స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశాం. మా బాయ్స్‌ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశారు. దాని ఫలితం ఈ మ్యాచ్‌లో కనిపించింది. ఇక ఢిల్లీ పిచ్‌లో మేము ఇటీవల టెస్టు మ్యాచ్‌ ఆడాము. అప్పటికంటే పిచ్‌ కాస్త బిన్నంగా ఉంది. ఇటువంటి వికెట్‌పై  స్లో మీడియం బౌలర్ల అవసరం చాలా ఉంటుంది.

స్పిన్నర్లకు కూడా ఈ వికెట్‌ అనుకూలిస్తుంది.  కాగా 173 పరుగులు ఏమీ చిన్న లక్ష్యమేమి కాదు. ఛేజింగ్‌లో మా బాయ్స్‌ అందరూ తమ వంతు సహకారం అందిస్తారని నేను ముందే ఊహించాను. అదే విధంగా పవర్‌ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టాలని కిషన్‌తో నేను చెప్పాను. ఇద్దరం దూకుడుగా ఆడి పవర్‌ప్లేను ఫినిష్‌ చేశాం. కీలక సమయంలో తిలక్‌ వర్మ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ ఒక యువ సంచలనం.

తిలక్‌తో నమోదు చేసిన భాగస్వామ్యమే మా విజయానికి ప్రధాన కారణం. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు ఇదే తొలి ఐపీఎల్‌. కాబట్టి వారికి మద్దతుగా ఉండాల్సిన అవసరం మాకు ఉంది. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా మా జట్టులో పెద్దగా మార్పులు చేయాలి  అనుకోవడం లేదు. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి అనుకుంటున్నాం" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: అదే మేము చేసిన తప్పు.. గెలిచే మ్యాచ్‌లో ఓడాం! అతడు మాత్రం అద్భుతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement