ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్, హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. 29 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు.
ముఖ్యంగా 16 ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, రెండు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ముంబైకు మరింత చేరువ చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ.. 147 పరుగులతో ముంబై తరపున టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
అయితే ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతులు ఎదుర్కొన్న వర్మ 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
ఇక ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. "బ్యాటింగ్‌కు కష్టంగా మారుతున్న పిచ్‌పై తిలక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ముంబైకి దొరికిన విలువైన ఆస్తి అని" ప్రముఖ వ్యాఖ్యాత హార్షా బోగ్లే ట్విటర్ వేదికగా అభినందించాడు. ఇక మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణించే సత్తా ఉన్న తిలక్.. భారత జట్టులోకి ఖచ్చితంగా ఎం‍్రటీ ఇస్తాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: రెండేళ్ల తర్వాత సూపర్ హాఫ్ సెంచరీ.. అయినా రోహిత్ నో సెలబ్రేషన్స్! కారణం అదేనా?
TILAK VARMA 🔥 WHAT A PLAYERpic.twitter.com/JCwYX4ld8k
— Johns. (@CricCrazyJohns) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment