PC: IPL.com
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 6వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ముంబై విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ(45 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు), తిలక్ వర్మ(41) కీలక పాత్ర పోషించారు.
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆఖరి బంతికి గెలుపొందింది. చివరి బంతికి ముంబై గెలుపుకు రెండు పరుగులు అవసరమవ్వగా.. టిమ్ డేవిడ్ తెలివిగా ఆడి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
హాఫ్ సెంచరీ చేసినా నో సెలబ్రేషన్స్
ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 29 బంతుల్లోనే హిట్‌మ్యాన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రెండేళ్ల తర్వాత అర్ధశతకం సాధించనప్పటికి, రోహిత్ ఎటువంటి సెలబ్రేషన్స్ జరపుకోలేదు. ఎందుకంటే రోహిత్ ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాలని భావించాడు.
తను ఇంకా ఈ మ్యాచ్‌లో చేయాల్సింది చాలా ఉందని భావించిన రోహిత్ ఎటువంటి సెలబ్రేషన్స్ జరుపుకోలేదు. అయితే రోహిత్ తన అర్ధశతకం తర్వాత మరో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: Suryakumar: మరో గోల్డెన్ డక్.. టి20ల్లో కూడా పనికిరాడా?
Another result on the final ball of the game 🙌
— IndianPremierLeague (@IPL) April 11, 2023
An epic game to record @mipaltan's first win of the season 🔥🔥
Scorecard ▶️ https://t.co/6PWNXA2Lk6 #TATAIPL | #DCvMI pic.twitter.com/u3gfKP5BoC
Rohit Sharma fifty pic.twitter.com/3kc92EHAsn
— @Habibullah_dbg (@imHabib71) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment