
Kane Williamson 2nd Captain To Score Half Century T20 WC Finals.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంతకముందు శ్రీలంక కెప్టెన్‌గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇక విలియమ్సన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment