Photo: IPL Twitter
అజింక్యా రహానే.. ఈ పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు.. అని ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ ఆడిన మ్యాచ్‌లో రహానే ఆట చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అలా సాగింది రహానే ఆటతీరు.
ఏమని చెప్పగలం.. ఎంతని చెప్పగలం.. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అనే అనుమానం కూడా కలగక మానదు. అంతలా విధ్వంసం చేసి పారేశాడు. చినుకు చినుకు గాలి వానలా మారి తుఫాను విధ్వంసంతో విరుచుకుపడిందన్నట్లుగా రహానే ఇన్నింగ్స్ సాగింది.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానే మొత్తంగా 29 బంతుల్లో 71 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే తుఫానుకు ముందు ప్రశాంతత అన్నట్లుగా సీఎస్‌కే ఇన్నింగ్స్ 13 ఓవర్ ముగిసే సరికి రహానే 14 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత నుంచి రహానే విధ్వంసం మొదలైంది.
ఓవర్‌కు సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లుగా సాగింది అతని ఇన్నింగ్స్. 14 బంతుల్లో 19 పరుగులు చేసిన రహానే.. తాను ఎదుర్కొన్న చివరి 15 బంతుల్లో 60 పరుగులు బాదాడు. దీన్నిబట్లే రహానే విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో దక్కించుకున్న సీఎస్‌కేకు అతను రెట్టింపు న్యాయం అందిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రహానే తన ముందు కుర్రాళ్లు కూడా దిగదిడుపూ అని నిరూపించాడు.
🔥 We are using 'Ridiculous' and 'Rahane' in one sentence... who would have thunk!? 🤯#KKRvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/zXhhtfIFlv
— JioCinema (@JioCinema) April 23, 2023
Comments
Please login to add a commentAdd a comment