Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మన్ పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న కమిన్స్ ఎంట్రీతోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన కమిన్స్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి కేకేఆర్ 162 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు ఓవర్లు ఉండగానే అందుకుంది.
ఈ నేపథ్యంలోనే కమిన్స్ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించిన ఆటగాడిగా కమిన్స్.. కేఎల్ రాహుల్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. 14 బంతుల్లో కమిన్స్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా.. కేఎల్ రాహుల్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లోనే ఫిప్టీ సాధించాడు.
వీరి తర్వతి స్థానంలో యూసఫ్ పఠాన్(2014లో ఎస్‌ఆర్‌హెచ్‌పై) 15 బంతుల్లో అందుకొని రెండో స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్(2017లో ఆర్‌సీబీపై) 15 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక కమిన్స్ ముంబైపై మంచి రికార్డు ఉంది. అతని చివరి మూడు ఇన్నింగ్స్‌లు పరిశీలిస్తే వరుసగా.. 33, 53*,56* పరుగులు ఉన్నాయి.
చదవండి: IPL 2022: రోహిత్ శర్మ ఆడడం మరిచిపోయావా .. ఏమైంది నీకు!
Comments
Please login to add a commentAdd a comment