
విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఓపెనర్ శిఖర్ ధావన్(73), కెప్టెన్ విరాట్ కోహ్లి(50)లు అర్థ సెంచరీలు సాధించారు. దీంతో భారత బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ డకౌటవ్వడంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ తరుణంలో తొలుత ధావన్ 42 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్‌లో 25వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరికాసేపటికే 64 బంతుల్లో 5 ఫోర్లతో కోహ్లి కెరీర్‌లో 46వ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ దశలో జట్టు స్కోరు 140 పరుగుల వద్ద డుమినీ బౌలింగ్‌లో ధావన్ 76(63 బంతులు, 12 ఫోర్లు) మార్క్‌రమ్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment