
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పాండ్యా మరో సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో నడిపించాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో అర్థశతకం మార్క్ సాధించాడు. ఇక ఓవరాల్‌గా పాండ్యా మ్యాచ్‌లో 52 బంతుల్లో 87*పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
కాగా పాండ్యాకు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌లో పాండ్యా ఇలా వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా టీమిండియా జట్టులో లేడు. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న హార్దిక్.. గుజరాత్ టైటాన్స్ తరపున మాత్రం కసి మొత్తం చూపిస్తున్నాడు. రానున్న టి20 ప్రపంచకప్ 2022 దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా మళ్లీ జట్టులోకి తిరిగి రావాలని పాండ్యా టార్గెట్‌గా పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment