లీస్టర్‌షైర్, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అర్థసెంచరీతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌లో సూపర్ సిక్సర్ బాదిన ఆడిన పంత్ 72 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఓవరాల్‌గా 87 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. మరి తాజా ఇన్నింగ్స్‌తో పంత్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా అని అభిమానులు కామెంట్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 76, రిషి పటేల్ 34, రోమన్ వాకర్ 34, లుయిస్ కింబర్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 246 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.
5️⃣0️⃣ for @RishabhPant17! 👏
— Leicestershire Foxes 🏏 (@leicsccc) June 24, 2022
A top edged sweep flies for 6️⃣ and helps Pant reach a 𝐦𝐚𝐠𝐧𝐢𝐟𝐢𝐜𝐞𝐧𝐭 half-century. 🧹
🦊 LEI 204/6
𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/DdQrXej7HC👈
🦊 #IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/MndQrfAm1n
చదవండి: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్.. దిగ్గజాల సరసన చోటు
Comments
Please login to add a commentAdd a comment