కోహ్లి, రాహుల్ అర్ధసెంచరీలు | lokesh rahul, virat kohli hits half centuries | Sakshi
Sakshi News home page

కోహ్లి, రాహుల్ అర్ధసెంచరీలు

Published Thu, Aug 20 2015 2:10 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ లోకేశ్ రాహుల్ అర్ధసెంచరీలు సాధించడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పుంజుకుంది.

కొలంబో: కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ లోకేశ్ రాహుల్ అర్ధసెంచరీలు సాధించడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పుంజుకుంది. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ ను కోహ్లి, రాహుల్ అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు.

మూడో వికెట్ కు 164 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఈక్రమంలో కోహ్లి ముందుగా అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. 63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో అతడికిది 11 అర్ధసెంచరీ. రాహుల్ 94 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. టెస్టుల్లో అతడికిది తొలి అర్థసెంచరీ. టీమిండియా  181/3  స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. కోహ్లి 78 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్(87), రోహిత్ శర్మ(3) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement