వారెవ్వా సూపర్‌ త్రో.. రుతురాజ్‌ గైక్వాడ్‌ రనౌట్‌ | Syed Mushtaq T20: Deepraj Gaonkar Direct Hit Ruturaj Gaikwad Run Out | Sakshi
Sakshi News home page

Syed Mushtaq T20: వారెవ్వా సూపర్‌ త్రో.. రుతురాజ్‌ గైక్వాడ్‌ రనౌట్‌

Published Tue, Nov 9 2021 7:08 PM | Last Updated on Tue, Nov 9 2021 9:21 PM

Syed Mushtaq T20: Deepraj Gaonkar Direct Hit Ruturaj Gaikwad Run Out - Sakshi

Ruturaj Gaikwad Run Out Syed Mustak Ali T20 Trophy.. ఐపీఎల్‌ 2021 హీరో రుతురాజ్‌ గైక్వాడ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో సూపర్‌ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఐపీఎల్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తు‍న్న రుతురాజ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలోనూ రెచ్చిపోతున్నాడు. ఇక గోవాతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన రుతురాజ్‌.. గోవా ఆటగాడు దీప్‌రాజ్‌ గోవాంకర్‌ డైరెక్ట్‌ త్రోకు బలయ్యాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్ నాలుగో బంతిని రుతురాజ్‌ లెగ్‌సైడ్‌ దిశగా ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగుకోసం వెళ్లగా.. అప్పటికే బంతిని అందుకున్న దీప్‌రాజ్‌ త్రో వేయగా.. బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో రుతురాజ్‌ క్లియర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. 

చదవండి: James Pattinson: బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి

ఇక మ్యాచ్‌లో మహారాష్ట్ర గోవాపై 73 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. యష్‌ నాయర్‌(68 బంతుల్లో 103, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గోవా 18.1 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. 

https://www.bcci.tv/videos/155606/deepraj-gaonkar-s-brilliant-direct-hit-to-run-out-ruturaj-gaikwad?fbclid=IwAR1V4uPNxKpQMKRekqJzNUELZ20lOXj9BsU1Ak0AVaRlaPU0OZLX9qL_VlY

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement