మాజీలతో మరో లీగ్ | Masters Champions League unveils 'icons' | Sakshi
Sakshi News home page

మాజీలతో మరో లీగ్

Published Thu, Jun 4 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

Masters Champions League unveils 'icons'

 దుబాయ్: ఓవైపు సచిన్, వార్న్ కలిసి లెజెండ్స్ టి20 లీగ్ ప్రారంభిస్తుంటే... మరోవైపు దుబాయ్‌లో మాజీ క్రికెటర్లతో మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) పేరుతో మరో లీగ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ క్రికెట్ బోర్డు అనుమతితో జరగనున్న ఈ లీగ్ 2016 ఫిబ్రవరిలో మొదలవుతుంది. మొత్తం 90 మంది మాజీ క్రికెటర్లతో ఆరు జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. లారా, వసీం అక్రమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ఇందులో ఆడతారు. జీఎం స్పోర్ట్స్ అనే సంస్థ పదేళ్ల పాటు ఈ లీగ్ నిర్వహణకు అనుమతి తీసుకుంది. డీన్‌జోన్స్ దీనిని పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement