టొరంటో: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గ్లోబల్ టి20 లీగ్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగా... మరోవైపు ఈ లీగ్‌లో బరిలోకి దిగిన అతను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టొరంటో నేషనల్స్ తరఫున ఆడిన స్మిత్ (41 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు.
అతనితోపాటు ఆంటోన్ డేవ్‌సిచ్ (44 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్ ఆరు వికెట్ల తేడాతో వాంకోవర్ నైట్స్‌పై విజయం సాధించింది. మొదట వాంకొవర్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎవిన్ లూయిస్ (55 బంతుల్లో 96; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), రసెల్ (20 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదరగొట్టారు. అనంతరం టొరంటో నేషనల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment