
క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మన్ బంతి ఎదుర్కొవడానికి ముందు గార్డ్ ఇవ్వడం ఆనవాయితీ. రైట్ హ్యాండ్ అయితే రైట్‌గార్డ్.. లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ గార్డ్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్ మాత్రం ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్ చేశాడు. ఎంసీఏ టి20 క్లబ్స్ ఇన్విటేషన్ 2020లో భాగంగా కేఎల్ స్టార్స్, రాయల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
రాయల్ వారియర్స్ వికెట్ కీపర్ హరీందర్‌జిత్ సింగ్ కొత్త బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చాడు. వాస్తవానికి హరీందర్‌జిత్ రైట్ హ్యాండ్ బ్యాటర్. కానీ బ్యాటింగ్ గార్డ్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గార్డ్ చూపించాడు. ఇది చూసిన అంపైర్ కూడా ఆల్‌రైట్ అన్నాడు. కేఎల్ స్టార్స్ కెప్టెన్ కూడా హరీందర్‌జిత్ బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఫీల్డర్లను సెట్ చేశాడు. బౌలర్ బంతి విసరడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. అప్పటివరకు లెఫ్ట్‌హ్యాండ్ ఆర్డర్‌లో ఉన్న హరీందర్ జిత్.. ఒక్కసారిగా రైట్‌హ్యాండ్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు.
ఇది చూసిన మనకు షాక్.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నవ్వులు విరపూశాయి. కేఎల్ స్టార్స్ కెప్టెన్ కూడా ఫీల్డింగ్ ఆర్డర్ మార్చాడు. అలా అంపైర్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను వస్తూనే ఫూల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను హరీందర్ జిత్ షెకాన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. '' నేను క్రికెట్ ఆడుతున్న ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటిది ఇంతకముందు ఎప్పుడు జరగలేదు.. నాతోనే ఇది సాధ్యమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాయల్ వారియర్స్ 51 పరుగుల తేడాతో కేఎల్ స్టార్స్‌పై విజయం సాధించింది. ఆటగాళ్లను ఫూల్ చేసిన హరీందర్‌జిత్ షెకాన్ 48 బంతుల్లో 56 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అతని స్కోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ వారియర్స్ 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. 125 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్ వారియర్స్ 74 పరుగులకే ఆలౌట్ అయింది.
చదవండి: World Cup 2022: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్... గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో!
IPL 2022: ఇదేం షాట్ అయ్యా యష్ ధుల్ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే!
Never seen anything like this before in all my years of cricket 🤣🤣
— Harinder Sekhon (@harinsekhon9) March 21, 2022
Just wait for it..🤣 pic.twitter.com/HOO82voD5y