Yash Dhull No Look Up Cut: Yash Dhull Gears Up For IPL 2022 With Stunning Unorthodox Shot - Sakshi
Sakshi News home page

IPL 2022: ఇదేం షాట్‌ అయ్యా యష్ ధుల్‌ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే!

Published Tue, Mar 22 2022 1:17 PM | Last Updated on Wed, Mar 23 2022 6:51 PM

Yash Dhull gears up for IPL 2022 with stunning unorthodox shot - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022కు సమయం దగ్గర పడడంతో అన్ని జట్లు నెట్స్‌లో చెమట్చోడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఆటగాడు, భారత అండర్-19 కెప్టెన్‌‌ యష్ ధుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్‌లో అద్భుతమైన షాట్‌లు ఆడుతూ యష్ ధుల్ అలరించాడు. అయితే ప్రాక్టీస్‌లో భాగంగా బంతిని చూడకుండానే 'అప్పర్ కట్' షాట్‌ ఆడి అందరనీ యష్‌ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన యష్ ధుల్‌ను ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.50 లక్షలకు  ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. అండర్‌-19 ప్రపంచకప్‌ 2022లో భారత జట్టును ఛాంపియన్‌ యశ్‌ ధుల్‌ నిలిపిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు విదేశీ స్టార్‌ ఆటగాళ్లు దూరం కానున్నారు.

పాకిస్తాన్‌ పర్యటన కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, మిచ్‌ల్‌ మార్ష్‌ ఢిల్లీ జట్టు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మరో వైపు ఆ జట్టు పేస్‌ బౌలర్‌ అన్రీచ్‌ నోర్జే జట్టులో చేరినప్పటికీ అతడు అందుబాటుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇక మార్చి 26 నుంచి  ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటిల్స్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement