-
భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సీజన్‌కు మరో ఐదో రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న తొలి మ్యాచ్‌లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ఆరంభానికి ముందే ప్రత్యర్ధి జట్లను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని హడలెత్తిస్తున్నాడు. చెపాక్‌లో ప్రాక్టీస్ క్యాంప్‌లో బీజీబీజీగా ఉన్న ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. తనదైన స్టైల్లో భారీ షాట్లతో ఎంఎస్ విరుచుకుపడుతున్నాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా ధోని భారీ సిక్స్‌లు కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తలైవా ఈజ్ బ్యాక్.. ఈ సీజన్లో బౌలర్లకు చుక్కలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధోనికి ఇదే ఆఖరి సీజన్ అయ్యే అవకాశముంది. 42 ఏళ్ల ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది. ఇక ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 సార్లు టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021,203 లో మిస్టర్ కూల్ చెన్నైకు టైటిల్స్ అందించాడు. చదవండి: శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజం.. Imagine the atmosphere of the stadiums when he replicate these in front of full-packed crowd 😍❤️🔥 pic.twitter.com/5xtrBMHacg — TELUGU MSDIANS🦁™ (@TeluguMSDians) March 16, 2024 -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్.. షాక్ తిన్న హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 76వ శతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-0తో చేజక్కించుకుంది. అలా టెస్టు సిరీస్ ముగియగానే వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. గురువారం తొలి వన్డే ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి చేసిన పని నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాధన చేసిన కోహ్లి ఒక బంతికి చక్కటి షాట్ ఆడి తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. 'మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి..?'' అన్నట్లు పాండ్యా చూస్తూంటే.. కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండ్రీ దాటడం పక్కా అన్నట్లు డ్యాన్స్ చేశాడు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు.. తనదైన డ్యాన్సింగ్ స్టెల్లో చేతులు ఊపుతూ విచిత్ర హావభావాలు పలికించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2023 చదవండి: కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్ -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా! ఫోటోలు వైరల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇక ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్న రోహిత్ సేన నెట్ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా త్రోడౌన్ స్పెషలిస్టులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే విధంగా భారత వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా చాలా సమయం నెట్స్‌లోనే గడిపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. మరోవైపు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. బెంగళూరు సమీపంలోని ఆలూర్ లో ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్‌కు గుడ్ న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు #TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA — BCCI (@BCCI) February 3, 2023 -
భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్-2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ప్రాక్టీస్‌ను మరింత వేగవంతం చేశాడు. ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ధోని మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సీఎస్కేను.. ఈ సారి మాత్రం ఛాంపియన్‌గా నిలపాలని తలైవా భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే మిస్టర్ కూల్ జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పిన్ బౌలింగ్‌కు ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. భారీ సిక్స్‌లు కొట్టడం ఆ వీడియోలో కన్పించింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా రాంఛీ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా టీమిండియా ఆటగాళ్లను ధోని కలిసిన సంగతి తెలిసిందే. ఇక గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కానుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ధోని సారథ్యంలో సీఎస్కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. చదవండి: SA20 2023: ముంబై జట్టుకు స్టార్ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఎంట్రీ! MS Dhoni smashing 6s during today’s practice session! #Dhoni #IPL2023 #CSK @msdhoni pic.twitter.com/ZiVROmMVs4 — MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెచ్చిపోతున్న ‘పచ్చ’ మంద
అధికారంలోకి వస్తే పాతేస్తాం
జేఎన్టీయూ పురోగతికి సహకరిస్తా
భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు
మహిళలే మహరాణులు
హైదరాబాద్ శివారులో బద్రీనాథుడు.. అచ్చం ఉత్తరాఖండ్ లాగే నిర్మాణం (ఫొటోలు)
పెనమలూరులో తుఫ్యాన్
తప్పక చదవండి
- ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement