
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
దీంతో మీరు ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న వన్ (ఒకశాతం) పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment