utility bills
-
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న వన్ (ఒకశాతం) పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. -
కక్కుర్తి పడ్డారు.. జైలుకెళ్లారు
సౌదీ : వాళ్లంతా కోట్లకు పడగలెత్తిన యువరాజులు. చిటికేస్తే అన్నీ పనులు క్షణంలో జరిగిపోతాయి. ఉదయం ఇటలీలో ఇడ్లీ తిని, లంచ్ లండన్‌లో చేయగల స్తోమత ఉన్నవారు. అయినా కొద్దిపాటి మొత్తానికే కక్కుర్తి పడ్డారు. ఇంటిలో వాడుకున్న కరెంట్ బిల్లు, నీటి బిల్లు కట్టకుండా జైలుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. బిల్లులు కట్టకుండా తిరుగుతున్న 11మంది సౌదీ యువరాజులను అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇంటిలో ఉపయోగించుకున్న కరెంటు బిల్లు, నీటి బిల్లులతో పాటు వివిధ రకాల బిల్లులు కట్టకుండా ఉన్న వారిని శనివారం అరెస్టు చేసినట్లు సౌదీ అటార్నరీ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రాజకుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ అరెస్టుల వెనుక యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని రాజకుటుంబాలు ఆందోళన వ్యక్తం చేన్నాయి. సల్మాన్ పాలన ట్రంప్ పాలనను తలపిస్తోందని రాజకుటుంబాలు విమర్శించాయి. గత ఏడాది నవంబర్‌లో రిట్జ్-కార్ల్టన్ హోటల్‌ను నిర్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పనిచేస్తున్న క్యాబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలతో సహా డజన్ల మంది ప్రభావశీల సౌదీలను అరెస్టు చేయించాడు. మహ్మద్ బిన్ సల్మాన్ అధికారం చేపట్టినప్పటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాలతో పాటు, ఇతర రంగాల్లో కీలక మార్పులు తీసుకువచ్చారు. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మహ్మద్ ప్రత్యర్థులను అధికారం నుంచి తప్పించేశాడు. -
ఆ నోట్లతో ప్రభుత్వ బిల్లులన్నీ చెల్లించొచ్చు
రద్దు చేసిన పాత పెద్ద నోట్లతో మరో మూడు రోజుల పాటు ప్రభుత్వ బిల్లులను చెల్లించొచ్చని కేంద్రప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కరెంటు బిల్లులు, ఆస్ధి పన్నులు, నీటి బిల్లులు, ప్రభుత్వ ఆసుపత్రి బిల్లులు, రైలు టికెట్లు, ప్రజా రవాణ వ్యవస్ధ, విమాన టికెట్లు, పాల బూతులు, స్మశాన వాటికలు, టోల్ గేట్లు, మెట్రో రైలు టికెట్లు, మెడికల్ షాపుల బిల్లులు, గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, రైల్వే క్యాటరింగ్, పెట్రోలు బంకుల్లో పాత రూ.500, రూ.1000 నోట్లను మరో 72గంటల పాటు వినియోగించుకోవచ్చని తెలిపింది. బ్యాంకులు ఏటీఎంలో నింపిన డబ్బు వెంటనే అయిపోవడంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని బిల్లులను పాత నోట్లతో ఈ నెల 14వరకూ చెల్లించొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.