సౌదీ : వాళ్లంతా కోట్లకు పడగలెత్తిన యువరాజులు. చిటికేస్తే అన్నీ పనులు క్షణంలో జరిగిపోతాయి. ఉదయం ఇటలీలో ఇడ్లీ తిని, లంచ్ లండన్‌లో చేయగల స్తోమత ఉన్నవారు. అయినా కొద్దిపాటి మొత్తానికే కక్కుర్తి పడ్డారు. ఇంటిలో వాడుకున్న కరెంట్ బిల్లు, నీటి బిల్లు కట్టకుండా జైలుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. బిల్లులు కట్టకుండా తిరుగుతున్న 11మంది సౌదీ యువరాజులను అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇంటిలో ఉపయోగించుకున్న కరెంటు బిల్లు, నీటి బిల్లులతో పాటు వివిధ రకాల బిల్లులు కట్టకుండా ఉన్న వారిని శనివారం అరెస్టు చేసినట్లు సౌదీ అటార్నరీ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రాజకుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
అయితే ఈ అరెస్టుల వెనుక యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని రాజకుటుంబాలు ఆందోళన వ్యక్తం చేన్నాయి. సల్మాన్ పాలన ట్రంప్ పాలనను తలపిస్తోందని రాజకుటుంబాలు విమర్శించాయి. గత ఏడాది నవంబర్‌లో రిట్జ్-కార్ల్టన్ హోటల్‌ను నిర్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పనిచేస్తున్న క్యాబినెట్ మంత్రులు, వ్యాపారవేత్తలతో సహా డజన్ల మంది ప్రభావశీల సౌదీలను అరెస్టు చేయించాడు. మహ్మద్ బిన్ సల్మాన్ అధికారం చేపట్టినప్పటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాలతో పాటు, ఇతర రంగాల్లో కీలక మార్పులు తీసుకువచ్చారు. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మహ్మద్ ప్రత్యర్థులను అధికారం నుంచి తప్పించేశాడు.
Comments
Please login to add a commentAdd a comment