ఆ నోట్లతో ప్రభుత్వ బిల్లులన్నీ చెల్లించొచ్చు
రద్దు చేసిన పాత పెద్ద నోట్లతో మరో మూడు రోజుల పాటు ప్రభుత్వ బిల్లులను చెల్లించొచ్చని కేంద్రప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కరెంటు బిల్లులు, ఆస్ధి పన్నులు, నీటి బిల్లులు, ప్రభుత్వ ఆసుపత్రి బిల్లులు, రైలు టికెట్లు, ప్రజా రవాణ వ్యవస్ధ, విమాన టికెట్లు, పాల బూతులు, స్మశాన వాటికలు, టోల్ గేట్లు, మెట్రో రైలు టికెట్లు, మెడికల్ షాపుల బిల్లులు, గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, రైల్వే క్యాటరింగ్, పెట్రోలు బంకుల్లో పాత రూ.500, రూ.1000 నోట్లను మరో 72గంటల పాటు వినియోగించుకోవచ్చని తెలిపింది.
బ్యాంకులు ఏటీఎంలో నింపిన డబ్బు వెంటనే అయిపోవడంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని బిల్లులను పాత నోట్లతో ఈ నెల 14వరకూ చెల్లించొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.