మహిళలే మహరాణులు | Sakshi
Sakshi News home page

మహిళలే మహరాణులు

Published Mon, May 6 2024 8:55 AM

మహిళలే మహరాణులు

మాడుగుల : మాడుగుల మహారాజుల పాలన కాలంలో ఈ ప్రాంతం సుభిక్షంగా తులతూగుతూ ఉండేదని, దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులతో నిత్యం కళకళలాడేదని చరిత్రకారులు చెబుతున్నారు. యుద్ధ వీరులను తయారు చేయడానికి ఏడు సావిడిలు, గుర్రాలకు తర్ఫీదు ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ శాలలు ఉండేవని స్థానికంగా వయసు మళ్లిన వారు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే రాజుల కాలం ముగిసిపోయిన తర్వాత ఇక్కడి కోటలో నాటి రాజ వంశస్తులు ఎవరూ నివాసం ఉండకపోవడంతో కోట శిథిలమైపోయింది. జమిందారీ వ్యవస్థ రద్దయే ముందు ఒక ఏడాది రమాకుమారి దేవ్‌, భర్త రామకృష్ణదేవ్‌ ఈ సంస్థానం చిట్టచివరి రాజవంశీకులుగా పాలన సాగించారు. రమాకుమారి దేవ్‌ చిట్టచివరి మహారాణిగా ఇక్కడి వారు చెబుతుంటారు. జమిందా రీ వ్యవస్థ రద్దు కావడంతో రమాకుమారి దేవ్‌ మాడుగుల కోటలో నివాసం ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 1967 నుండి 1972 వరకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజుల కాలాన్ని గుర్తు చేస్తూ పరిపాలన సాగించి ప్రజల మన్ననలు పొందినట్లు ఇక్కడి వారు చెబుతుంటారు. అలాగే మాడుగులలో బొడ్డు కళావతి కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనూరాధ బరిలో ఉన్నారు. తండ్రి బూడి సేవాగుణాన్ని పుణికిపుచ్చుకున్న అనూరాధ పేదల సేవలో అలుపూసొలుపు లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా సాయం అర్థించిన వారిని ఆదుకుంటూ నాటి దయార్ధ్ర హృదయులైన రాణులకు తానేమీ తీసిపోనని మాడుగుల ప్రజలచే మన్ననలు అందుకుంటున్నారు.

ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణ చూరగొన్న మాడుగుల ఆఖరి మహారాణి రమాకుమారి దేవ్‌

ప్రజా సేవకు సిద్ధమంటున్న ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లె అనూరాధ

Advertisement
Advertisement