99.9% కేసుల్ని పరిష్కరించామన్న ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో సీ–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ప్రారంభించిన సీ–విజిల్ యాప్‌ను ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారని ఈసీ తెలిపింది. మార్చి 16 నుంచి మే 15వ తేదీ వరకు ఈసీకి (4,24,317) ఫిర్యాదులు అందగా.. ఇందులో 99.9%, 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించామని శనివారం ఈసీ ఒక ప్రకటనలో వివరించింది.
నగదు, మద్యం, ఉచితాల పంపిణీకి సంబంధించి 7,022 ఫిర్యాదులు అందగా అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనపై 3,24,228 ఫిర్యాదులు వచి్చనట్లు తెలిపింది. అదేవిధంగా, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై 2,430, అనుమతి లేని వాహన కాన్వాయ్‌లపై 2,697, నిషేధ సమయంలో ప్రచారంపై 4,742 ఫిర్యాదులు వచ్చాయి. స్పీకర్ల వినియోగం, మతపరమైన ప్రసంగాలకు సంబంధించి 2,883 ఫిర్యాదుల అందగా ఇతరత్రా 66,293 కేసులొచ్చాయని ఈసీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment