Complainants
-
Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో సీ–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ప్రారంభించిన సీ–విజిల్ యాప్‌ను ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారని ఈసీ తెలిపింది. మార్చి 16 నుంచి మే 15వ తేదీ వరకు ఈసీకి (4,24,317) ఫిర్యాదులు అందగా.. ఇందులో 99.9%, 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించామని శనివారం ఈసీ ఒక ప్రకటనలో వివరించింది. నగదు, మద్యం, ఉచితాల పంపిణీకి సంబంధించి 7,022 ఫిర్యాదులు అందగా అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనపై 3,24,228 ఫిర్యాదులు వచి్చనట్లు తెలిపింది. అదేవిధంగా, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై 2,430, అనుమతి లేని వాహన కాన్వాయ్‌లపై 2,697, నిషేధ సమయంలో ప్రచారంపై 4,742 ఫిర్యాదులు వచ్చాయి. స్పీకర్ల వినియోగం, మతపరమైన ప్రసంగాలకు సంబంధించి 2,883 ఫిర్యాదుల అందగా ఇతరత్రా 66,293 కేసులొచ్చాయని ఈసీ వివరించింది. -
శాంతిభద్రతల విఘాతానికే లోకేశ్ కుట్ర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : విద్వేషపూరిత ప్రసంగాలతో వర్గ విభేదాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రపన్నిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పోలీసు శాఖను కోరింది. ఈమేరకు వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా విభాగం ఇన్చార్జిలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో శుక్రవారం ఫిర్యాదులు చేశారు. పాదయాత్ర కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తూ మరీ లోకేశ్, ఇతర టీడీపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించేలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేశారు. మంత్రులు, వైఎస్సార్సీపీ శాసన సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతోపాటు వారి అంతుచూస్తామని బెదిరించడాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు, అలజడులు సృష్టించాలన్నది లోకేశ్ పన్నాగమని పేర్కొన్నారు. శాంతిభద్రతలను భగ్నం చేసేందుకు యత్నించిన లోకేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పాదయాత్ర కోసం పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రంలోని షరతులకు కట్టుబడేలా కట్టడి చేయాలని కోరారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో జిల్లా సోషల్ మీడియా కన్వినర్ చిక్కాల దుర్గాప్రసాద్ నేతృత్వంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరిపై ఎన్ని ఎక్కువ పోలీసు కేసులు నమోదైతే వారికి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతటి ప్రాధాన్యం ఇస్తామంటూ ఘర్షణలను ప్రేరేపించేలా ప్రసంగిస్తున్నారని తెలిపారు. టీడీపీ మూకలను ఉగ్రవాదుల తరహాలో ప్రజలపై ఉసిగొల్పుతూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా లోకేశ్ ప్రసంగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వినర్ మేకా వెంకట్రామిరెడ్డి మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లోనూ శుక్రవారం పలువురు ఫిర్యాదు చేశారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లోనూ చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు చేశారు. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్లోనూ వైఎస్సార్సీపీ నాయకులు లోకేశ్, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల కన్వినర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల దాడులపై పలు కేసులు నమోదు హనుమాన్ జంక్షన్ : లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేసిన టీడీపీ నేతలపై వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాలరావు, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్, కనకవల్లి శేషగిరి, కనకవల్లి చిన్న యాకోబ్, కొలుసు రంగారావు, మందపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణ తదితరులపై 307, 324 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేత తలారి వినయరత్నంపై దాడికి పాల్పడ్డ ఘటనపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేతలు మొవ్వా వేణుగోపాల్, పరసా కిరణ్, బెజవాడ కృష్ణ, పొలగాని వీరాంజనేయులు తదితరులపై ఐపీసీ సెక్షన్లు 323. 506 రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేత కసుకుర్తి చైతన్య ధర్మేంద్ర (చిన్ను)పై జరిగిన దాడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, మొవ్వా వేణుగోపాల్, మొవ్వా శ్రీనివాసరావు, వెనిగళ్ల జ్ఞానశేఖర్, కనకవల్లి శేషగిరిరావు, కనకవల్లి చిన్న యాకోబ్, కొలుసు రంగారావు, మందపాటి రాంబాబు, ఆళ్ల గోపాలకృష్ణపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 323, 506, 290 రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలు అయ్యన్న, బుద్దాపై కేసులు ఉంగుటూరు : కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో ఇటీవల జరిగిన యువగళం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు వారిపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. అయ్యన్నపై 153ఏ, 354ఏ1 (4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద, బుద్దా వెంకన్నపై 153, 153ఏ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
మ్యూచువల్ ఫండ్స్‌లోనే తక్కువ ఫిర్యాదులు
ముంబై: భారతీయ మ్యచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ వ్యవస్థలోనే అతి తక్కువ ఫిర్యాదులతో మెరుగైన స్థానంలో ఉందని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. పరిశమ్రపై ఉన్నవి నిరాధార దూషణలే తప్పించి, వాస్తవాలు వేరని పేర్కొంది. భారత మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఎంతో పారదర్శకతతో, సమగ్ర సమాచారాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఫండ్స్ పెట్టుబడుల సమాచారం వెల్లడించడం ఆధారంగా 26 దేశాల్లో భారత్‌కు మొదటిస్థానాన్ని మార్నింగ్‌స్టార్ ఇచ్చినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ ప్రకటించారు. యాంఫి ఇన్వెస్టర్ల నుంచి, పంపిణీదారుల నుంచి నేరుగా, సెబీ ద్వారానూ ఫిర్యాదులు అందుకుంటుందని వివరించారు. ఇలా వచ్చే ఫిర్యాదులను సాధారణమైన, తీవ్రమైన అని రెండు రకాలుగా వర్గీకరిస్తామని చెప్పారు. ‘‘డివిడెండ్ రాకపోవడం, అకౌంట్ స్టేట్మెంట్, కమీషన్ రాకపోవడం, రికార్డ్ అప్డేట్ చేయకపోవం సాధారణ ఫిర్యాదులు. దరఖాస్తు ఫారాల్లో అక్రమాలకు పాల్పడడం, మార్కెట్ యూనిట్లు, ఫండ్స్‌లో అవకతవకలకు పాల్పడడం, పంపిణీదారుల సేవల్లో లోపాలను తీవ్రమైనవిగా పరిగణిస్తాం’’అని వివరించారు. 2017 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య కేవలం 5,330 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. ఇదే కాలంలో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.40 లక్షల కోట్లకు చేరాయన్నారు. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, బీమా, స్టాక్స్‌లో ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. -
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో క్వాలిటీ సమస్యా? అసలు ఏమైంది?
సాక్షి, ముంబై: గూగుల్ పిక్సెల్ ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హవా చాటుకున్న గూగుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది అక్టోబరులో లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో వీడియో కాల్ నాణ్యత బాగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. అద్భుతమైన ఇమేజింగ్ నాణ్యత, పిక్చర్ క్యాప్చరింగ్ ఫోన్లగా చెప్పుకుంటున్న ఈ ఫోన్లలో రియర్, సెల్పీ కెమెరాల వీడియో క్వాలిటీ పూర్, మసక మసకగా ఉంటోందని యూజర్లు ఫిర్యాదు చేశారు. (ఫోటో క్రెడిట్: ఆండ్రాయిడ్ పోలీస్) Google Meetతో సహా పలు యాప్‌లలో వీడియో క్వాలిటీ అసలు బాలేదనీ, ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వీడియో నాణ్యత చాలా తక్కువగా ఉన్నాయని రెడిట్ యూజర్ ఒకరు ఫిర్యాదు చేశారు. అంతేకాదు Pixel 7 నుండి రిసీవ్ చేసుకున్న వీడియోలు కూడా అస్పష్టంగా,మసక బారినట్లుగా ఉన్నాయని ఆరోపించారు. పలువురు ట్విటర్ వినియోగదారులు కూడా దాదాపు ఇదే ఆరోపణ చేశారు. పిక్సెల్ 7 ప్రోతో Google Meetలో వీడియో కాల్ చేస్తున్నప్పుడు నాసెల్పీ కెమెరా అసలు క్లియర్‌గా లేదు..దీనికేదైనా పరిష్కారం ఉందా అని అని ఒకరు గత నెలలో ట్వీట్ చేశారు. (ఫోటో క్రెడిట్: ఆండ్రాయిడ్ పోలీస్) గూగుల్ సొంత యాప్‌తోపాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాం యాప్స్‌లో వీడియో కాల్స్ అస్పష్టంగా ఉన్నాయని పిక్సెల్ 7 ప్రో యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దీనిపై డజన్ల కొద్దీ ఇతర Android వినియోగదారులు వ్యాఖ్యానించినట్టు ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. గతంలో పిక్సెల్ 6లో ఇలాంటి సమస్యే వచ్చిందని నివేదించింది. సాఫ్ట్వేర్ సమస్య కావచ్చని సాఫ్ట్వేర్ అప్డేట్ద్వారా గూగుల్ దీన్ని పరిష్కరించాలని యూజర్లుకోరుతున్నారు. కాగా గతంలో కూడా గూగుల్ పిక్సెల్ 7 యూజర్లు రియర్ కెమెరా గ్లాస్ పగిలిన ఫిర్యాదుల నేపథ్యంలో రీప్లేస్ చేసింది. మరి తాజా ఫిర్యాదులపై ఎలా స్పందిస్తుందో చూడాలి. గూగుల్ పిక్సెల్ 7 ధర రూ. 52,950, గూగుల్ పిక్సెల్ 7 ప్రొ ధర రూ. 84,999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో అక్టోబర్ 2022లో భారతదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఫిర్యాదుదారులపై విచారణాధికారి రుబాబు
కోటవురట్ల(పాయకరావుపేట): విచారణకు వచ్చిన అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. నోటి దురుసుతో ఫిర్యాదుదారులపై మండి పడి, బెదిరింపు ధోరణిలో వ్యవహరించడమే కాకుండా వివరణ కోరిన పాత్రికేయులపైనా దురుసుగా మాట్లాడి కాల్ ద పోలీసు అంటూ హడావుడి చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని సమన్వయ అధికారి డాక్టర్ వడ్డి శ్రీధర్‌పై ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి ఏడాది క్రితం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో ఒకసారి విచారణకు హాజరు కావాలని ఎంపీపీ వరహాలమ్మకు, జెడ్పీటీసీ వెంకటలక్ష్మికి విచారణాధికారి నోటీసులు పంపించి, విచారణ జరిపేందుకు ఆ అధికారి రాలేదు. మళ్లీ బుధవారం విచారణకు వస్తున్నట్టు నోటీసులు పంపడంతో ఎంపీపీ, జెడ్పీటీసీ హాజరయ్యారు. విచారణాధికారిగా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరై మొదటి నుంచి దురుసుగా ప్రవర్తించారు. సుమారు గంట సేపు ఫిర్యాదుదారులైన ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మితో మాట్లాడి వారి వాదన నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పలువురు మండల స్థాయి అధికారులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం గదిలో నుంచి బయటకు రాగానే పాత్రికేయులు వివరణ కోరారు. పాత్రికేయులకు సమాధానమివ్వకుండా పశుసంవర్ధక శాఖ సిబ్బందిపై డీడీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఒరేయ్ గేటు, తలుపులు వేసేయ్..ఎవడు పడితే వాడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు’ అంటూ మండిపడ్డారు. వివరాలు తెలపాలని పాత్రికేయులు కోరగా అవసరం లేదు, ఇక్కడి నుంచి పోతారా పోలీసులను పిలవాలా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదిక కలెక్టర్‌కు ఇస్తాను.. ఎట్టకేలకు విచారణాధికారి శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడారు. విచారణ పూర్తయిందని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కోర్టును ఆశ్రయిస్తాం.. విచారణాధికారి శ్రీనివాసరావు మాతో ఆగ్రహంగా మాట్లాడారని, మహిళా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ మండల సమన్వయ అధికారికి వత్తాసు పలికేలా వ్యవహరించారని ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి ఆరోపించారు. మీవి తప్పుడు ఆరోపణలఅంటూ మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఫిర్యాదు గురించి వివరిస్తూ మండల సమన్వయ అధికారి వడ్డి శ్రీధర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయ కక్షతో తమకు పథకాల సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా సమావేశాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరయ్యేలా చూస్తున్నారన్నారని, తనిఖీల పేరిట కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నారని, సొంత విధులు నిర్వహిండమానివేసి, మండలంపై పెత్తనం చెలాయించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. దీంతో ఫిర్యాదు చేశామన్నారు. అయితే విచారణాధికారి శ్రీనివాసరావు తమ శాఖాధికారైన ఏడీని కాపాడే ధోరణిలోనే వ్యవహరించారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. -
ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి
జిల్లా రెండుగా విడిపోయినా ప్రజావాణికి ఫిర్యాదుదారుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు.. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాౖటెనా ఫిర్యాదుల సంఖ్య మారలేదు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 84 ఫిర్యాదులు నమోదయ్యాయి. కలెక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, డీఆర్వో పద్మాకర్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు తరలివచ్చే వారు. అయితే, జిల్లాల పునర్విభజనలో భాగంగా కామారెడ్డి కొత్తగా జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఫిర్యాదులు తగ్గే అవకాశముందని భావించారు. కానీ, ఎప్పట్లాగే ఈసారి కూడా కలెక్టరేట్‌కు వచ్చే వారి తాకిడి ఏమాత్రం తగ్గలేదు. – ఇందూరు -
తప్పుడు కేసులపై వాటికా గ్రూపు ఆగ్రహం
గూర్గావ్ : రియల్ ఎస్టేట్ డెవలపర్ వాటికా గ్రూపుపై వచ్చిన ఆరోపణలను, నమోదైన తప్పుడు కేసులను ఆ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సీనియర్ అధికారులు తిప్పికొడుతున్నారు. చీటింగ్‌కు పాల్పడామంటూ తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అవన్నీ తప్పుడు ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే వాటికా గ్రూపు ఎండీ గౌతమ్ భల్లా, గ్రూపు డైరెక్టర్లు అనిల్ భల్లా, గౌరవ్ భల్లా, క్లైయింట్ సర్వీసు హెడ్ అంకిత్ నాగ్‌పాల్‌లపై చీటింగ్ కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన స్యాంత్పురా వాసి సుమన్ ప్రీత్ కౌర్, ఆమె భర్త సురేంద్ర పాల్ సింగ్ ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ సెక్షన్లు 406,420ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే కంపెనీ రిప్యూటేషన్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి చీటింగ్ కేసులను తమపై పెడుతున్నారని వాటికా గ్రూపు సీఆర్ఎమ్ అధినేత వికాస్ మన్హాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోపణల్లో నిజమెతుందో త్వరలోనే బయటపడుతుందని ధీమా వ్యక్తంచేశారు. పోలీసుల విచారణలో కచ్చితంగా నిజనిజాలను బయటకి వస్తాయని, ఫిర్యాదుదారులు నిజాలను దాచిపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఫిర్యాదుదారులు వాటికా వన్ ఎక్స్‌ప్రెస్ సిటీలో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారని, దానికోసం 22 లక్షల వరకు ఇన్స్టాల్ మెంట్లో చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే తాము 2015 డిసెంబర్లో సైట్‌కి వెళ్లి చూస్తే, ఇంకా స్థలం బంజరు భూమిలానే ఉందని చెప్పారు. తాము చెల్లించిన నగదును రీఫండ్ చేయాలని కోరినప్పుడు, ఆ ప్రాజెక్టు రద్దైందని, కొత్త ప్రాజెక్టుకు తమ నగదు బదిలీ చేయాలని అప్పుడే రీఫండ్ చేస్తామని కంపెనీ అధికారి నాగ్‌పాల్ బెదిరించినట్టు ఫిర్యాదులో కౌర్ పేర్కొన్నారు. ఆ నగదును వాటికా ఇతర ప్రాజెక్టులకు మరలించినప్పటికీ, తమ చెల్లింపులు వెనక్కి రాలేదని వాపోయారు. రీప్లేస్మెంట్లో బెదిరించి వాటికా సెవన్ ఎలిమెంట్స్‌లో ఓ ఫ్లాట్ బుక్ చేశారని, కానీ తాము బుక్ చేసుకున్నదానికి, కంపెనీ ఆఫర్ చేసిన దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు శాఖలోని ఆర్థిక అక్రమాల విభాగం విచారణ జరుపుతోంది.