vigil
-
Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో సీ–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ప్రారంభించిన సీ–విజిల్ యాప్‌ను ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారని ఈసీ తెలిపింది. మార్చి 16 నుంచి మే 15వ తేదీ వరకు ఈసీకి (4,24,317) ఫిర్యాదులు అందగా.. ఇందులో 99.9%, 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించామని శనివారం ఈసీ ఒక ప్రకటనలో వివరించింది. నగదు, మద్యం, ఉచితాల పంపిణీకి సంబంధించి 7,022 ఫిర్యాదులు అందగా అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్ల ప్రదర్శనపై 3,24,228 ఫిర్యాదులు వచి్చనట్లు తెలిపింది. అదేవిధంగా, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై 2,430, అనుమతి లేని వాహన కాన్వాయ్‌లపై 2,697, నిషేధ సమయంలో ప్రచారంపై 4,742 ఫిర్యాదులు వచ్చాయి. స్పీకర్ల వినియోగం, మతపరమైన ప్రసంగాలకు సంబంధించి 2,883 ఫిర్యాదుల అందగా ఇతరత్రా 66,293 కేసులొచ్చాయని ఈసీ వివరించింది. -
జపాన్ ఫుట్‌బాల్ లీగ్‌లో ‘విజిల్’ క్లైమాక్స్
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన బిగిల్ చిత్రం తెలుగులో విజిల్ అనే పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను తెగఆకట్టుకుంటోంది. విజిల్ మూవీ క్లైమాక్స్‌లో భాగంగా జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హీరో విజయ్ టీమ్ ప్లేయర్స్ చేసే గోల్స్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అయితే ప్రస్తుతం ‘విజిల్’ క్లైమాక్స్ లోని కొన్ని సీన్స్ జపాన్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కనపడ్డాయి. మంగళవారం జపాన్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇది కాస్త అటు ఇటుగా విజిల్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. మైదానం సెంటర్ పాయింట్ నుంచి ఏకంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసి ఓ ప్లేయర్ గోల్ సాధించాడు. ఈ షాక్ నుంచి ప్రత్యర్థి జట్టు కోలుకునేలోపే సేమ్ సీన్ రిపీటయింది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా గోల్స్ సమర్పించుకోవడంతో ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కాగా, కేవలం 90 సెకన్ల వ్యవధిలో రెండు షాకింగ్ గోల్స్ చేసిన ఆ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ‘ఆడు మగాడ్రా బజ్జి.. 90 సెకన్లలో రెండు గోల్స్ చేశాడు’, ‘ఆ గోల్ పోస్టులను ఇంకొంచెం దూరం పెట్టండి లేకుంటే కష్టం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఆడు మగాడ్రా బుజ్జి..
-
ఉపవాసం.. జాగరణం
ఉపవాసం, జాగరణ.. ఈ రెండూ ఆధ్యాత్మికమైన తృప్తినీ, మనశ్శాంతినీ ఇస్తాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల మేరకు ఓ మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణారోగ్యంగా ఉన్నట్లు. అందుకే మన సంస్కృతి నిర్దేశించిన ఉపవాసం, జాగరణ వంటి నియమాలను పాటిస్తూనే, ఆరోగ్యంపై వాటి ప్రభావం పడకుండా చూసుకోవడం అవసరం. యువతీ యువకులు తాము ఒకింత కఠిన ఉపవాసం చేయవచ్చు. కానీ రోజూ మందులు తీసుకోవాల్సిన పెద్ద వయసువారు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించాలి. మరీ కఠినంగా పాటించనంత వరకు ఉపవాసాలు కొంతవరకు ఉపయోగకరమే. ఆరోగ్యదాయకమే. ఉపవాసం సమయంలో ఒంట్లో ఏం జరుగుతుందంటే... సాధారణంగా మనం తీసుకునే ఆహారానికీ, ఆహారానికీ మధ్య కొంత వ్యవధి ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత మళ్లీ ఉదయం తీసుకునే భోజనం వరకు ఉండే వ్యవధి ఎక్కువ కాబట్టే.. మనం ఉదయం తీసుకునే ఆహారాన్ని ‘బ్రేక్ ఫాస్ట్’గా పేర్కొంటారు. అంటే... రాత్రి ఉపవాసాన్ని ‘బ్రేక్’ చేసే ఆహారం అన్నమాట. ఇది రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియ. కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ రోజులో సాధారణంగా మనం ఐదు నుంచి ఆరుగంటల వ్యవధిలో భోజనం చేస్తూ ఉంటాం. మన ఒంట్లోని జీవక్రియలకూ, మన పనులకూ అవసరమైన చక్కెరలు అందాలంటే అలా భోజనం చేస్తుంటాం. దాంతో మన దేహం కూడా ఆ ‘సైకిల్’కు అలవాటు పడి ఉంటుంది. మన ఒంట్లోని జీవక్రియలకు అవసరమైన శక్తి చక్కెర నుంచి, ఆ చక్కెరలు మన ఆహారం నుంచి అందుతుంటాయి. మనకు అవసరమైన శక్తి అందకుండానే మళ్లీ యథాతథమైన పనులన్నీ జరగాలంటే.. అందుకు తగినంత శక్తి అందక శరీరం మొరాయిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఒంట్లో ఉండాల్సిన చక్కెర మోతాదుల్లో తేడాలు వచ్చినప్పుడు వెంటనే శరీరానికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు పడిపోతూ ఉంటుంది. ఒంట్లోని చక్కెరలు బాగా తగ్గిపోయే కండిషన్‌ను ‘హైపోగ్లైసీమియా’ అంటారు. ఫలితంగా సాధారణ రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మెదడుకు, దాంతోపాటు ఒంట్లోని కీలక అవయవాలకు తగినంత రక్తం అందకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఉపవాసం వల్ల ఒంట్లోని సాధారణ పనులకు అవసరమైన శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో మన దేహంలో నిల్వ ఉన్న కొవ్వుల నుంచీ, కొన్ని సందర్భాల్లో కండరాల నుంచి కూడా మన శరీరానికి అవసరమైన శక్తిని తీసుకుంటూ ఉంటుంది. దీనికి అనుగుణంగానే మళ్లీ మనం మన దేహాన్ని రోజువారీ చేసే కఠినమైన శారీరక శ్రమతో కూడిన పనులతో అలసిపోయేలా చేయకూడదు. ఉపవాసం ఉన్న రోజుల్లో అలాంటి పనులు ఏవైనా ఉంటే.. వాటికి తాత్కాలికంగా దూరంగా ఉండటం మేలు చేస్తుంది. ఇక కొందరు నీళ్లు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తుంటారు. మన దేహంలో జరిగే జీవక్రియల్లో మెదడు నుంచి వచ్చే ఆదేశాలన్నీ లవణాల తాలూకు విద్యుదావేశ మూలకాల రూపంలోనే జరుగుతుంటాయి. ఒంట్లో తగినన్ని ఖనిజాలూ, లవణాలూ ఉండి, అవి ద్రవరూపంలోకి మారితేనే అవి ఖనిజలవణాల విద్యుదావేశ మూలకాల రూపంలోకి మారి.. తద్వారా మెదడు నుంచి దేహంలోని రకరకాల అవయవాలకు అవసరమైన ఆదేశాలు అందుతుంటాయి. ఇందుకు తగినన్ని పాళ్లలో ఒంట్లో నీరుండటం ఎంతగానో అవసరం. ఒంట్లో ఉండాల్సిన నీటిపాళ్లు తగ్గితే అది డీహైడ్రేషన్‌కు దారితీసి మెదడు నుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందవు. పైగా ఒక్కోసారి కండరాల్లో ఉండాల్సిన మృదుత్వం తగ్గిపోయి, అవి బిగుసుకుపోతాయి. పై కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఉపవాసం సమయంలో కేవలం మన ఒంట్లోని కొవ్వులు మాత్రమే దహనం అయ్యేంత మేరకే మనం ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో నీరు తీసుకోవడం నిషిద్ధ కాదు కాబట్టి మరీ ఎక్కువగా కాకపోయినా, ఒంట్లోని జీవక్రియలకు అవసరమైనంతగానైనా నీరు తీసుకుంటూ ఉండాలి. షుగర్, హైబీపీ ఉన్నవారికి సూచనలు షుగర్, హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసానికి ముందుగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుని, అప్పుడే తగినన్ని నీళ్లతో తాము రోజూ వేసుకోవాల్సిన టాబ్లెట్లను తీసుకోవాలి. ఒకవేళ రోజులో ఒక క్రమపద్ధతిలో వేసుకోవాల్సిన మాత్రలేవైనా ఉంటే.. వాటిని తప్పించకూడదు (స్కిప్ చేయకూడదు). నీళ్లతో టాబ్లెట్లు వేసుకోవడం ప్రధానాహారం కాదు కాబట్టి అది పెద్దగా దోషం కాబోదంటూ మనసుకు నచ్చజెప్పుకొని ఆరోగ్యం కోసం విధిగా వేళకు మాత్రలు వాడాలి. జాగరణ కోసం ఈరోజుల్లో రాత్రి చాలా సేపటివరకు మేల్కొని ఉండటం సాధారణమైపోయింది. దాంతో పోలిస్తే.. ఇక జాగరణ పేరిట నిద్రకు దూరంగా ఉండాల్సిన సమయం ఏ ఐదారు గంటలో అదనంగా ఉంటుంది. అయితే కిందటి రాత్రి నిద్రపోలేదు కాబట్టి ఆ మర్నాడు పగలు పడుకోవడాన్ని వీలైనంత వరకు నివారించాలి. ఎందుకంటే ఆ పగటి నిద్ర వల్ల రాత్రికి ఆలస్యంగా నిద్రపట్టడం, అసలే పట్టకపోవడం జరిగి నిద్ర క్రమం తప్పవచ్చు. జాగరణ కోసం ఈ జాగ్రత్త పాటిస్తే మంచిది. డా. సుధీంద్ర ఊటూరిలైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
హైదరాబాద్: ఓ పదేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున విజిల్ ను మింగాడు. దీంతో అతడి నోటి నుంచి వింతవింత శబ్దాలు రావడం మొదలైంది. ఈ శబ్దాలు విన్న తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. అతడు విజిల్ మింగిన విషయం తెలియక.. అతన్ని తీసుకొని ప్రైవేటు ఆస్పత్రులన్నింటి చుట్టూ తిరిగారు. అయినా, ఎంతకూ సమస్య పరిష్కారం కాకపోవడంతో గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు. గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు బాలుడి ఊపిరితిత్తులలో విజిల్ ను గుర్తించారు. కష్టసాధ్యమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి.. బాలుడి ఊపిరితిత్తుల నుంచి విజిల్ ను బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన గాంధీ వైద్యులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని తుఫాను, భారీ వర్షాలు మరోసారి వణికిస్తున్నాయి. వార్దా తుఫాను విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ముఖ్యంగా వార్దా తుఫాను, ఈదురుగాలులకు భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రధాన జలాశయాల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యంగా పూండి, చంబరం పక్కం ఇతర జలాశయాల ప్రాంతాల్లో దృష్టి పెట్టాలని కోరింది. తమిళనాడు లోని చెన్నె తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో వర్షపాతం తీవ్రత భారీగా ఉంది. కొన్ని ప్రదేశాలలో 7-19 సెం.మీ వర్షం నమోదైంది. ఇదిక్ర మంగా పెరుగుతూ 20 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీంతో చెన్నై నగరం చుట్టు పక్కల ఉన్న పూండి, చంబరం పక్కం రిజర్వాయర్లు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్లు పూర్తిగా నిండనప్పటికీ, ఊహించని వర్షాలతో ప్రమాదకరంగా మారేఅవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించినట్టు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వర్షధాటికి భారీగా చెట్లు కూలిపోతున్నాయి. దీంతో నావీ రంగంలోకి దిగింది. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే రెండు నౌకలు అందుబాటులో ఉంచామని, తక్షణం సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ ఛీప్ కెప్టెన్ డీకే శర్మ ప్రకటించారు. -
డ్రోన్ల ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక
బెంగళూరు: కర్ణాటక హోంశాఖలో డ్రోన్ (అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ - యూఏఈ) దళం ఏర్పాటైంది. మొత్తం 20 మంది సిబ్బంది కలిగిన ఈ విభాగం వివిధ రకాల నిఘా విషయాలపై దృష్టి సారించనుంది. ఓ రాష్ట్ర పోలీసు శాఖలో డ్రోన్ దళం ఏర్పాటు కావడం దేశంలో ఇదే మొదటిసారి. దక్షిణ కొరియా నుంచి ఒక్కొక్కటి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 12 డ్రోన్లను కర్ణాటక కొనుగోలు చేసింది. 18.5 మెగాపిక్సల్స్ సామర్ధ్యం కలిగిన ఫాంటం మోడల్ కు చెందిన ఈ డ్రోన్లు రాత్రుళ్లు కూడా ఫోటో, వీడియోలను చిత్రించగలవు. ప్రస్తుతం వీటిని రాష్ట్రంలోని ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు, గనుల తవ్వకాలపై నిఘా ఉంచడానికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ మాట్లాడుతూ.. డ్రోన్ వినియోగంపై ఇప్పటివరకు 20 మంది సిబ్బందికి శిక్షణనిచ్చినట్లు తెలిపారు. వీరు కొప్పళ్, యాదగిరి, బళ్లారి, బీదర్, రాయచూర్, కల్బుర్గి జిల్లాల్లో విధులు నిర్వస్తున్నట్లు వివరించారు. -
ఉపవాసం.. ఉపయోగం...
నమశ్శివాయ! ఏడాదికి ఒక్కరోజైనా శరీర అంతర్గత అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు శివరాత్రి. శివభక్తులు ఉపవాసన, జాగరణ చేస్తుంటారు. వారి దీక్ష మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే... పండ్లు - పాలు చాలా మంది ఈ రోజు పండ్లు, పాలతో సరిపెట్టేస్తారు. ఇది చాలా మంచిది. పాలు సమతుల ఆహారం. పండ్లు పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆకలి కానివ్వకుండా సాయపడతాయి. రోజులో కనీసం ఆరు సార్లు పండ్లు, పాలతో సరిపెట్టడం వల్ల శరీరంలోని విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ పద్ధతి ప్రతి రోజూ జరుగుతుంది. ఈ పనంతా కాలేయం చేస్తుంది. రోజంతా పండ్లు, పాలు తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, దాంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ♦ పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు అందడం వల్ల పోషకాహార లోపం వంటివి ఉంటే ఈ రోజుతో భర్తీ అవుతాయి. పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థ అంతా శుభ్రపడుతుంది. ♦ ఈ కాలం ప్రకృతి నుంచి పండ్లు బాగా అందుతాయి. వచ్చే ఎండాకాలానికి సిద్ధపడటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. ♦ రోజంతా తగినన్ని పండ్లు, పాలు తీసుకున్నవారు కేజీ నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సరైనది కాదు... ♦ రోజంతా ఏమీ తినకుండా కేవలం టీ, కాఫీలతో సరిపెట్టేయడం మంచిది కాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి పుడుతున్నప్పుడు ఆహారం అందివ్వకపోతే పొట్టలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అల్సర్ పెరిగి, మంట పుడుతుంది. తరచూ ఉపవాసాలు చేసేవారు ఇదే పద్ధతిని అనుసరిస్తే జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం చూపి, అనారోగ్యం కలుగుతుంది. ♦ ఉపవాసం వల్ల నిన్నంతా ఏమీ తినలేదు కదా అని ఉపవాస దీక్ష వదిలే రోజు ఉదయాన్నే కావల్సినదానికన్నా అధికంగా ఆహారం తీసుకుంటుంటారు కొందరు. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి, నిద్రపోతారు. తిండి, నిద్ర వల్ల ఒంట్లో అదనపు కొవ్వు పెరుగుతుంది. ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక... ♦ రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ♦ పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి. ♦ పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు. ♦ గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ♦ ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు. ♦ పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి. ♦ జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. ♦ పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. - డా.జానకి, న్యూట్రిషనిస్ట్, డైటా క్లినిక్ -
నీటి కోసం..జాగారం
కల్వకుర్తి, న్యూస్‌లైన్: గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో మహిళలు పొలానికి వెళ్లి పనిచేయడం మాని ప్రత్యేకంగా తాగునీటి కోసం వేచి ఉండే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులతో బిజీబిజీగా ఉండే గ్రామీణ ప్రజలు తాగునీటి కోసమే ఎక్కువ సమయం కేటాయించే దుస్థితి నెలకొంది. దీనికి తోడు విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో, ఉన్న కొద్ది పాటి నీటిని కరెంట్ వచ్చినపుడే సరఫరా చేస్తున్నారు. దీంతో మహిళలు రాత్రిళ్లు జాగారం చేస్తూ నీటికోసం పాట్లు పడుతున్నారు. నీళ్లున్నా..తప్పని తిప్పలు కొన్ని గ్రామాల్లోని బోర్లలో సరపడా నీళ్లున్నా నిర్వహణ లోపం, బోరుమోటార్లకు మరమ్మతు లు చేయించ కపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉండే అధికారులకు సమాచారం చేరడం, వారి స్పందించి తీరిక సమయంలో గ్రామానికి చేరుకొని మోటార్లను బాగుచేయించే నాటికి వారం, పది రోజులు పడుతోంది. బారులుతీరుతున్న జనం.. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. గతంలో పదుల సంఖ్యలో ఉండి, కాలనీలన్నింటికీ నీరందించే చేతిప ంపులు ప్రస్తుతం దిష్టిబొమ్మల్లా మారాయి. మరికొన్ని గ్రామాల్లో వచ్చే కొద్దిపాటి కోసం గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. తాగేందుకే నీరు సరిపడా ఉండటంలేదని, దీనికి తోడు కుంటలు, చెరువులు ఎప్పుడో ఎండిపోవడంతో మేకలు, పశువులకు తాగునీరులేక అల్లాడుతున్నాయని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేళాపాలా లేకుండా విద్యుత్ అధికారులు కోతలు విధిస్తుండటంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది.