జపాన్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇది కాస్త అటు ఇటుగా విజిల్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. మైదానం సెంటర్ పాయింట్ నుంచి ఏకంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసి ఓ ప్లేయర్ గోల్ సాధించాడు. ఈ షాక్ నుంచి ప్రత్యర్థి జట్టు కోలుకునేలోపే సేమ్ సీన్ రిపీటయింది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో ఎవరూ ఊహించని విధంగా గోల్స్ సమర్పించుకోవడంతో ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కాగా, కేవలం 90 సెకన్ల వ్యవధిలో రెండు షాకింగ్ గోల్స్ చేసిన ఆ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ‘ఆడు మగాడ్రా బజ్జి.. 90 సెకన్లలో రెండు గోల్స్ చేశాడు’, ‘ఆ గోల్ పోస్టులను ఇంకొంచెం దూరం పెట్టండి లేకుంటే కష్టం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.