
బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మరణాన్ని ఆమె ప్రియుడు, నటుడు చందు తట్టుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం వృథా అని తలచాడో ఏమో శుక్రవారం ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

నిజానికి చందుకు ఎప్పుడో పెళ్లయింది. పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే శిల్ప అనే అమ్మాయిని ప్రేమించాడు.

తనను లవ్ చేయాలంటూ ఆమె వెంటపడ్డాడు. అలా శిల్ప కూడా అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ 12 ఏళ్లు ప్రేమించుకున్నారు.

పెద్దలను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

యాక్టింగ్ మీద ఇష్టంతో ఐటీ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాడు. అక్కడ పవిత్ర జయరామ్‌తో ప్రేమలో పడ్డాడు. అప్పటికే పవిత్రకు సైతం ఒక పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు.

అయితే ఆమె 20 ఏళ్ల వయసులోనే భర్తకు విడాకులిచ్చేసి సింగిల్ మదర్‌గా వారిని పోషిస్తోంది. ఇకపోతే పవిత్ర- చందు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

మొన్నటి యాక్సిడెంట్‌లో పవిత్ర చనిపోగా మనస్తాపంతో చందు తన ప్రాణాలు తీసుకున్నాడు.

ఎప్పటికైనా మనసు మార్చుకుని వస్తాడనుకున్న భర్త ఇక రాడని తెలియడంతో గుండె పగిలేలా ఏడుస్తోంది శిల్ప.

చందు మృతి నేపథ్యంలో అతడి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




