Chandrakant
-
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
బుల్లితెర జంట చందు- పవిత్ర మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు త్వరలోనే భార్యాభర్తలుగా తమను పరిచయం చేసుకుందామనుకున్నారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో పవిత్ర మరణించగా తర్వాత ఐదు రోజులకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనపై ప్రముఖ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎవరి జీవితం వాళ్లది!'ఉమ్మడి కుటుంబంలో ఒకరు కిందపడితే పదిమంది వచ్చి పైకి లేపేవాళ్లు. మేమున్నామంటూ సపోర్ట్ చేసేవాళ్లు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేశాం. అమ్మానాన్న పిల్లలు.. ఇదే కుటుంబం! ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది, ఎవరి ఆశయాలు వాళ్లవి.. ఒక స్టేజ్ దాటాక ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు. పెద్దల మాటను పిల్లలు లెక్కచేయడం లేదు. ఒంటరితనంసంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అసలేం కోల్పోతున్నారనేది వాళ్లకు అర్థం కావడం లేదు. ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరైపోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు. నా విషయమే తీసుకుంటే అమ్మ చనిపోయాక కృష్ణగారు, నేను ఎంతగానో బాధపడ్డాం. మేము ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం. ఆ బలం వేరురోజూ ఉదయాన్నే ఆయనను పలకరించేవాడిని. మహేశ్‌బాబు కూడా మేము వచ్చి చూసెళ్తాం.. అని ధైర్యం చెప్పేవాడు. పది మంది నాకున్నారు అన్న బలం వేరు! ఎవరైనా మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కనుండాలి. ఈరోజుల్లో అది లేకుండా పోయింది. బంధాలు, బంధుత్వాలు లేకనే ఇలాంటివి జరుగుతున్నాయి' అని నరేశ్ అభిప్రాయపడ్డాడు.చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా -
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
స్కిల్ కేసు: ఈ నెల 29కి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారతానని ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షా వేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ వేయడానికి సమయం కోరారు. కేసులో సీఐడి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డును ఏసిబి కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు విచారణను 29కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో అప్రూవర్‌గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని కోర్టుకి చంద్రకాంత్ షా ఆధారాలు సమర్పించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషించారని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016లో తనని కలిశారని తెలిపారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లని ఇవ్వాలని వారు కోరినట్లు పిటిషన్లో చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానని తెలిపారు. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చెప్పారు. ఆ రూ.65కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలు పన్నుతున్నారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
‘స్కిల్’ స్కామ్‌లో షెల్.. షా
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల కుంభకోణం కేసులో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు గత సర్కారు పెద్దలు ఏకంగా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు శిరీష్ చంద్రకాంత్ షాను రంగంలోకి దించినట్లు తాజాగా వెల్లడైంది. ఏకంగా 212 షెల్ కంపెనీలను సృష్టించి రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డ శిరీష్‌ను అరెస్టు చేసేందుకు 2017లో స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుంది. ఘరానా మోసగాడిని భాగస్వామిగా చేసుకుని టీడీపీ పెద్దలు 2015లో ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టారంటే ఎంత పక్కాగా పన్నాగం పన్నారో స్పష్టమవుతోంది. 24 వరకు రిమాండ్.. మచిలీపట్నం జైలుకు తరలింపు ఈ కేసులో తాజాగా సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఆర్థిక నేరగాడు శిరీష్‌చంద్ర షాను ముంబైలో అరెస్టు చేశారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా ఈనెల 24వరకు రిమాండ్ విధించడంతో మచిలీపట్నంలోని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. షెల్ కంపెనీల డాన్... శిరీష్ శిరీష్ చంద్రకాంత్ షా దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్తుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 212 షెల్ కంపెనీలను సృష్టించి నల్లధనాన్ని దారి మళ్లించిన ఘనుడు. ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సెబీ తదితర సంస్థలన్నీ శిరీష్ చంద్రకాంత్ షా కోసం రంగంలోకి దిగాయంటే ఎంత ఘరానా నేరస్తుడో అర్థమవుతోంది. షెల్ కంపెనీలతో దేశ ఆర్థిక వ్యవస్థకే సవాల్‌గా మారిన అతడి ఆట కట్టించేందుకు కేంద్ర ఆదాయపన్ను శాఖ ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సహకారాన్ని కోరాల్సి వచ్చింది. పీఎంవో ఆధ్వర్యంలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ద్వారా అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. ‘స్కిల్’ కుంభకోణంలో కింగ్‌పిన్.. టీడీపీ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు శిరీష్ చంద్రకాంత్ షాను పావుగా వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కంపెనీ ద్వారా స్కిల్లర్ అనే షెల్ కంపెనీకి చెల్లించారు. ఆ కాంట్రాక్టు కింద హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరా చేసిందంటూ ఏసీఐ అనే మరో షెల్ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ నుంచి పొందిన రూ.371 కోట్లలో రూ.242 కోట్లను స్కిల్లర్ కంపెనీ ఏసీఐకి చెల్లించింది. ఏసీఐ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కథ నడిపించింది. అనంతరం రూ.242 కోట్లను తిరిగి టీడీపీ పెద్దలకు చెందిన డిజైన్‌టెక్‌కు చెల్లించింది. ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దొడ్డిదారిలో టీడీపీ పెద్దలకు కట్టబెట్టేందుకు సాధనంగా ఉపయోగపడిన షెల్ కంపెనీ ఏసీఐని శిరీష్ చంద్రకాంతే సృష్టించాడు. అతడు సృష్టించిన 212 షెల్ కంపెనీల్లో ఏసీఐ కూడా ఉందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. శిరీష్ చంద్రకాంత్ షా 212 షెల్ కంపెనీల ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల మేర నల్లధనాన్ని మళ్లించినట్లు ఆదాయపన్ను శాఖ 2017లోనే వెల్లడించింది. అందులో 2015–16లో ఏపీఎస్ఎస్డీసీ ద్వారా టీడీపీ సర్కారు చెల్లించిన నిధులు కూడా ఉన్నట్లు తాజాగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఈ ఒక్క కుంభకోణంలోనే కాదు 2014–19 మధ్య రాష్ట్రంలో పలు కుంభకోణాలకు సంబంధించి నిధులు మళ్లించేందుకు శిరీష్ చంద్రకాంత్ షాను టీడీపీ పెద్దలు వాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరిపితే భారీ స్థాయిలో కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
భారీగా ఆలయ నిర్మాణం
అహ్మదాబాద్/అయోధ్య: శ్రీరాముని జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల రామనామంతో పుర వీధులు ప్రతిధ్వనిస్తున్నాయి. మందిర నిర్మాణానికి 5వ తేదీన భూమిపూజ చేస్తున్న నేపథ్యంలో మందిరం డిజైన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంది. మొదట అనుకున్న దానికంటే రెట్టింపు సైజులో మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగర శైలిలో మందిరం ఆకృతి ఉంటుంది. గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయ ఆకృతిలో మార్పులు చేశామని, గతంలో కంటే భారీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆలయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమ్‌పుర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ శిఖరంతో పాటు రెండు గోపురాలు ఉండేలా గతంలో మందిరాన్ని డిజైన్ చేశామని ఇప్పుడు వాటి సంఖ్య అయిదుకి పెంచినట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మందిరానికి ఆకృతి ఆలయాల నిర్మాణంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర వంశస్తులు ప్రఖ్యాతి వహించారు. ఒకప్పుడు సోమనాథ్, అక్షరధామ్ ఆలయంతో పాటు 200పైగా ఆలయాలకు వీరు డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ వంశానికి చెందిన చంద్రకాంత్ సోమ్‌పుర (77) తన ఇద్దరు కుమారులతో కలిసి రామ మందిర నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. 30 ఏళ్ల క్రితమే విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ మందిరానికి డిజైన్ చేయాలని చెప్పినట్టుగా ఆయన వెల్లడించారు. ఆలయ విశిష్టతలు ► ఉత్తరాది ఆలయాల్లో కనిపించే నాగర శైలిలో మందిరం ఉంటుంది. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► మూడు అంతస్తుల్లో నిర్మించే రామ మందిరంలో అయిదు గోపురాలతో మండపాలు, శిఖరం ఉంటాయి. ► ఆలయం ఎత్తు 161 అడుగుల వరకు ఉంటుంది. ► 10 ఎకరాల స్థలంలో మందిరం, మిగతా 57 ఎకరాల్లో వివిధ సముదాయాలను నిర్మిస్తారు. ఢిల్లీలో భారీ తెరలు ఏర్పాటు సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో 5న జరిగే మందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా చెప్పారు. అయోధ్యలో భూమి పూజ రోజు పంచేందుకు మిఠాయిలు సిద్ధంచేస్తున్న దృశ్యం -
గీతాంజలి జెమ్స్ సీఎఫ్ఓ రాజీనామా
న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్ సీఎఫ్ఓ చంద్రకాంత్ కర్కరే రాజీనామా చేశారు. రూ.11,400 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో గీతాంజలి జెమ్స్‌కు కూడా భాగస్వామ్యం ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పీఎన్బీ స్కామ్‌లో కీలకమైన వ్యక్తి నీరవ్ మోదీకి వ్యాపార భాగస్వామి అయిన మెహుల్ చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్ షేర్.. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పతనమవుతూనే ఉంది. కంపెనీ సీఎఫ్ఓతో పాటు కంపెనీ వైస్ ప్రెసిడెంట్(కంప్లయన్స్), కంపెనీ సెక్రటరీ కూడా అయిన పంఖురి, బోర్డ్ సభ్యుడు కృష్ణన్ సంగమేశ్వరన్లు కూడా రాజీనామా చేశారని గీతాంజలి జెమ్స్ తెలిపింది. 4 రోజుల్లో 46 శాతం డౌన్.. గీతాంజలి జెమ్స్ కంపెనీ షేర్ వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ పతనమైంది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టపోయి రూ.33.80 వద్ద ముగిసింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 46 శాతం క్షీణించింది. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.344 కోట్లు హరించుకుపోయింది. -
ఏసీబీ ముందు గోవా ప్రతిపక్షనేత హాజరు
పణజి: గోవా ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ కావ్లేకర్ శుక్రవారం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ముందు హాజరయ్యారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని గత సంవత్సరం ఆయనపై, ఆయన భార్య సావిత్రిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 5న కావ్లేకర్‌కు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ రాబోయే అసెంబ్లీ సెషన్స్ కారణంగా తాను తీరిక లేకుండా ఉన్నానని ఐదో తారీఖున రాలేకపోతున్నానని ఇదివరకే తెలిపారు. తాను అమాయకుడినని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలనీ, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని చంద్రకాంత్ తెలిపారు. కావ్లేకర్ ఇప్పటికే స్థానిక కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాడు. ఫిబ్రవరి 12 వ తేదీ వరకు అతన్ని అరెస్టు చేయకుండా కోర్టు నుంచి అనుమతి పొందాడు. 2007 జనవరి నుంచి 2013 ఏప్రిల్ మధ్యకాలంలో గోవా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి కేరళలో ఆస్తులు కొనుగోలు చేశారని ఆయనపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. -
ప్రేమ ఎంత మధురం
చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్ రొయ్యూరుతో కలిసి గోవర్ధన్ గజ్జల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జితిన్ రోషన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను నిర్మాతలు సి.కళ్యాణ్, కిరణ్ విడుదల చేశారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. గోవర్ధన్ మాట్లాడుతూ– ‘‘సరిగ్గా సంవత్సరం క్రితం ఈ సినిమా కోసం అమెరికాలో ఉద్యోగం వదులుకొని శ్రీకారం చుట్టా. అమెరికాలో అందుబాటులో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో అధిక భాగం అక్కడే షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
రొమాంటిక్ థ్రిల్లర్
చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య తారలుగా రఘురాం రొయ్యూరుతో కలిసి గోవర్ధన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. ఈ సిన్మా టీజర్‌ను హీరో నారా రోహిత్ విడుదల చేశారు. ‘‘టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసే అంశాలున్నాయి. సినిమా మంచి హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ఈ వారంలో పాటల్ని, ఈ నెల 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు గోవర్ధన్. చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా తదితరులు పాల్గొన్నారు. -
మంచి బ్రేక్ అవుతుంది!
చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. గోవర్ధన్.జి స్వీయ దర్శకత్వంలో రఘురాం రొయ్యూరుతో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ అధిక భాగం అమెరికాలో జరిగింది. ఇటీవల విడుదలైన ఈ మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి, పెరిగింది హైదారాబాద్‌లోనే. ఇంజినీరింగ్ పూర్తి చేసి యాక్టింగ్‌ను కెరీర్‌గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాక అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్నా. ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం‘ వంటి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్‌తో హీరోగా పరిచయం కావడం నా లక్. చక్కని టీమ్‌తో రూపొందిన ఈ సినిమా నాకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు -
ప్రేమ ఎంత మధురం...
చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా గోవర్ధన్. జి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్ రొయ్యూరు సహనిర్మాత. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నవారు హీరోహీరోయిన్లుగా తీసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై ప్యాషన్‌తో అమెరికాలో ఉద్యోగం వదులుకున్నాను. ఓ అందమైన ప్రేమ కథకు కాస్తంత థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడించి, తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు గోవర్ధన్. జి. ‘‘యూనిట్ అందరికీ బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రఘురామ్ రొయ్యూరు. తనికెళ్ళ భరణి, తులసీ, జెమిని సుÆó.శ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జితిన్ రోషన్. -
ఒకేసారి రెండు సినిమాలు
చంద్రకాంత్, ఉమేశ్, వర్షిత జంటగా ‘ప్రేమవేదం’, ‘సూర్యనేత్రం’ పేరుతో ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటికీ దర్శక - నిర్మాత వినోద్‌వర్మ. ఈ సినిమాలతో తమకు గుర్తింపు వస్తుందని హీరో హీరోయిన్లు ఆశాభావం వెలిబుచ్చారు. వినోద్‌వర్మ మాట్లాడుతూ, ‘‘ఇరవై మూడేళ్లుగా పరిశ్రమలో పలు శాఖల్లో పనిచేశాను. టాటా మూవీస్ సంస్థ స్థాపించి, కొత్తవారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటిగా షూటింగ్ జరిపి, పూర్తిచేస్తాం’’ అని తెలిపారు. -
రాణించిన జైరాజ్, చంద్రకాంత్
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లు జైరాజ్ (107, 4/42), చంద్రకాంత్ దీక్షిత్ (4/53)రాణించారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 41 పరుగుల తేడాతో పీ అండ్ టీ జట్టుపై విజయం సాధించింది. తొలిరోజు హైదరాబాద్ టైటాన్స్ 281 పరుగులు చేసింది. పీ అండ్ టీ బౌలర్స్ అవినాష్ 5, గోవింద్ 4 వికెట్లు చేజిక్కించుకున్నారు. రెండో రోజు బరిలోకి దిగిన పీ అండ్ టీ 240 పరుగులు చేసింది. జట్టులో రాణాప్రతాప్ (64) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో మ్యాచ్‌లో మెగా సిటీ 107 పరుగుల తేడాతో విజయ హనుమాన్ జట్టుపై గెలుపొందింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన మెగాసిటీ 351 పరుగులు చేయగా... రెండో రోజు బరిలోకి దిగిన విజయ హనుమాన్ జట్టు 244 పరుగులు వద్ద ఆలౌటైంది. జట్టులో వంశీ 65, షరీఫ్ 46, సుఖీన్ జై న్ 44, రోహన్ 45 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచారు. మెగా సిటీ బౌలర్ శ్రవణ్ కుమార్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు జెమిని ఫ్రెండ్స్: 155 ; ఖల్సా: 159/8 (అలీ ఖాన్ 79 నాటౌట్, మెల్ బింటో 30) అవర్స్: 158 ; జై భగవతీ: 159/4 (రాహుల్ 89 నాటౌట్). పాషాబీడి: 132; ఉస్మానియా: 133/3 (సృజన్ 64 నాటౌట్, రామ్ ప్రసాద్ 43). సీసీఓబీ: 161; న్యూ బ్లూస్: 164/5 (దత్త ప్రకాష్ 71 నాటౌట్, అంకుష్ 36; యూసఫ్ 3/45). ఎస్బీఐ: 274/9 (అబూబకర్ 39, రంగనాథ్ 77; అఖిల్ గౌడ్ 4/58); నిజాం కాలేజ్: 158 (ధనుంజయ్ సింగ్ 45 నాటౌట్; అబ్రార్ అహ్మద్ 4/63, తిఖర్ ఉద్దీన్ 6/46). ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు హెచ్‌జీసీ: 104 (చరణ్ 42); కిషోర్‌సన్స్: 105/6. ఎస్‌యూసీసీ: 226/6 (లయాఖత్ 36, కబీర్ 36, ఫిరోజ్ 35, నవీద్40); సెయింట్ మేరీస్: 127 ( కుందన్ 37).