రొమాంటిక్‌ థ్రిల్లర్‌ | How much love sweetheart sweetheart is so hard to release teaser | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ థ్రిల్లర్‌

Published Sat, Sep 2 2017 12:43 AM | Last Updated on Tue, Sep 19 2017 1:02 PM

రొమాంటిక్‌ థ్రిల్లర్‌

రొమాంటిక్‌ థ్రిల్లర్‌

చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య తారలుగా రఘురాం రొయ్యూరుతో కలిసి గోవర్ధన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. ఈ సిన్మా టీజర్‌ను హీరో నారా రోహిత్‌ విడుదల చేశారు. ‘‘టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది. ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసే అంశాలున్నాయి.

సినిమా మంచి హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఇదొక అందమైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ వారంలో పాటల్ని, ఈ నెల 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు గోవర్ధన్‌. చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement