ప్రేమ ఎంత మధురం... | Prema Entha Madhuram Priyuraalu Antha Katinam Poster Launch | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎంత మధురం...

Published Sat, Aug 19 2017 12:34 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

ప్రేమ ఎంత మధురం...

ప్రేమ ఎంత మధురం...

చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా గోవర్ధన్‌. జి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్‌ రొయ్యూరు సహనిర్మాత. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అమెరికాలో యాక్టింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నవారు హీరోహీరోయిన్లుగా తీసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు.

‘‘సినిమాపై ప్యాషన్‌తో అమెరికాలో ఉద్యోగం వదులుకున్నాను. ఓ అందమైన ప్రేమ కథకు కాస్తంత థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ జోడించి, తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు గోవర్ధన్‌. జి. ‘‘యూనిట్‌ అందరికీ బ్రేక్‌ ఇచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రఘురామ్‌ రొయ్యూరు. తనికెళ్ళ భరణి, తులసీ, జెమిని సుÆó.శ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జితిన్‌ రోషన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement