జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లు జైరాజ్ (107, 4/42), చంద్రకాంత్ దీక్షిత్ (4/53)రాణించారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 41 పరుగుల తేడాతో పీ అండ్ టీ జట్టుపై విజయం సాధించింది. తొలిరోజు హైదరాబాద్ టైటాన్స్ 281 పరుగులు చేసింది.
పీ అండ్ టీ బౌలర్స్ అవినాష్ 5, గోవింద్ 4 వికెట్లు చేజిక్కించుకున్నారు. రెండో రోజు బరిలోకి దిగిన పీ అండ్ టీ 240 పరుగులు చేసింది. జట్టులో రాణాప్రతాప్ (64) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో మ్యాచ్‌లో మెగా సిటీ 107 పరుగుల తేడాతో విజయ హనుమాన్ జట్టుపై గెలుపొందింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన మెగాసిటీ 351 పరుగులు చేయగా... రెండో రోజు బరిలోకి దిగిన విజయ హనుమాన్ జట్టు 244 పరుగులు వద్ద ఆలౌటైంది. జట్టులో వంశీ 65, షరీఫ్ 46, సుఖీన్ జై న్ 44, రోహన్ 45 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచారు. మెగా సిటీ బౌలర్ శ్రవణ్ కుమార్ 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
జెమిని ఫ్రెండ్స్: 155 ; ఖల్సా: 159/8 (అలీ ఖాన్ 79 నాటౌట్, మెల్ బింటో 30)
అవర్స్: 158 ; జై భగవతీ: 159/4 (రాహుల్ 89 నాటౌట్).
పాషాబీడి: 132; ఉస్మానియా: 133/3 (సృజన్ 64 నాటౌట్, రామ్ ప్రసాద్ 43).
సీసీఓబీ: 161; న్యూ బ్లూస్: 164/5 (దత్త ప్రకాష్ 71 నాటౌట్, అంకుష్ 36; యూసఫ్ 3/45).
ఎస్‌బీఐ: 274/9 (అబూబకర్ 39, రంగనాథ్ 77; అఖిల్ గౌడ్ 4/58); నిజాం కాలేజ్: 158 (ధనుంజయ్ సింగ్ 45 నాటౌట్; అబ్రార్ అహ్మద్ 4/63, తిఖర్ ఉద్దీన్ 6/46).
ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు
హెచ్‌జీసీ: 104 (చరణ్ 42); కిషోర్‌సన్స్: 105/6.
ఎస్‌యూసీసీ: 226/6 (లయాఖత్ 36, కబీర్ 36, ఫిరోజ్ 35, నవీద్40); సెయింట్ మేరీస్: 127 ( కుందన్ 37).
రాణించిన జైరాజ్, చంద్రకాంత్
Published Tue, Oct 1 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement
Advertisement