భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్‌ | MS Dhoni hits huge sixes in CSK's training session | Sakshi
Sakshi News home page

IPL 2024: భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్‌

Published Sat, Mar 16 2024 4:27 PM | Last Updated on Sat, Mar 16 2024 6:19 PM

MS Dhoni hits huge sixes in CSKs training session - Sakshi

ఎంఎస్‌ ధోని(PC: IPL.com)

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2024 సీజన్‌కు మరో ఐదో రోజుల్లో తెరలేవనుంది. ​మార్చి 22న తొలి మ్యాచ్‌లో చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు ఆరంభానికి ముందే  ప్రత్యర్ధి జట్లను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని హడలెత్తిస్తున్నాడు.

చెపాక్‌లో ప్రాక్టీస్‌ క్యాంప్‌లో బీజీబీజీగా ఉన్న ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. తనదైన స్టైల్‌లో భారీ షాట్లతో ఎంఎస్‌ విరుచుకుపడుతున్నాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా ధోని భారీ సిక్స్‌లు కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తలైవా ఈజ్‌ బ్యాక్‌.. ఈ సీజన్‌లో బౌలర్లకు చుక్కలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధోనికి ఇదే ఆఖరి సీజన్‌ అయ్యే అవకాశముంది. 42 ఏళ్ల ధోని ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్‌ ఉంది.

ఇక ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 సార్లు టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021,203 లో మిస్టర్‌ కూల్‌ చెన్నైకు  టైటిల్స్ అందించాడు.
చదవండి: శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌గా పాకిస్తాన్‌ దిగ్గజం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement