సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు.
"2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు" అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్‌డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు పెంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment