ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. సీఎస్‌కే విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్‌లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పటికి తమకు అద్బుతమైన విజయాన్ని అందించారని రుతురాజ్ కొనియాడాడు.
"ధర్మశాల వికెట్ చాలా స్లోగా ఉంది. అంతే కాకుండా బంతి బాగా లో బౌన్స్ కూడా అయింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడే మా స్కోర్ బోర్డులో 180-200 పరుగులు ఉంచాలనకున్నాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో మాకు 160 నుంచి 170 పరుగుల మధ్య స్కోర్ వస్తే చాలు అని భావించాము.
మేము సరిగ్గా 167 పరుగులు సాధించాము. ఈ స్కోర్‌ను మేము డిఫెండ్ చేసుకుంటామన్న నమ్మకం మాకు ఉండేది. మా బౌలర్లు న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సిమర్‌జీత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో తను తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికి తన అనుభవాన్ని చూపించాడు.
అతడు గత సీజన్‌లో కూడా 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక వికెట్లు కోల్పోయినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటర్‌గా దించాలనుకున్నాము. బ్యాటర్ అయితే 10-15 పరుగులు అదనంగా చేస్తాడని భావించాము.
కానీ ఆఖరి నిమిషంలో మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. ఆ నిర్ణయమే మాకు విజయాన్ని అందించింది. సిమర్‌జీత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు ప్లూ జ్వరంతో బాధపడ్డారు.
మ్యాచ్ ముందు వరకు ఎవరూ జట్టు సెలక్షన్‌కు ఉంటారో క్లారిటీ కూడా లేదు. అటువంటిది ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రుతు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment