రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే? | Ruturaj Gaikwad's Captain Innings, CSK Scored 162/7 | Sakshi
Sakshi News home page

CSK vs PBKS: రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

Published Wed, May 1 2024 9:30 PM | Last Updated on Thu, May 2 2024 9:29 AM

Ruturaj Gaikwad's Captain Innings, CSK Scored 162/7

ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింది. సీఎస్‌కే బ్యాట‌ర్లు కాస్త త‌డ‌బ‌డ్డారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 

ఓ వైపు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందిచాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. రుతురాజ్‌తో పాటు ధోని 14 పరుగులతో రాణించాడు.

పంజాబ్ బౌలర్లలో హార్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహ‌ర్ త‌లా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడ త‌లా వికెట్ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement