టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్)లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జితేష్ శర్మ క్యాచ్‌ను పట్టిన ధోని.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్‌లో ధోని ఖాతాలో ఇప్పటివరకు 141 క్యాచ్‌లతో పాటు 42 స్టంపింగ్‌లు కూడా ఉన్నాయి. ఈ ఘనత సాధించిన జాబితాలో ధోని తర్వాత ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 141 క్యాచ్‌లు అందుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్‌కే 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది.
పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, సిమ్రాజిత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment