
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తిరిగి మైదానంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాడు. దీనిలో భాగంగా రన్నింగ్‌తో ప్రాక్టీస్ ప్రారంభించిన వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
జూన్ చివరి వారంలో కెనడాలో జరిగే టీ20 గ్లోబల్ లీగ్‌లో వార్నర్ ఓ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. త్వరలో ఈ లీగ్ కోసం వార్నర్ కెనడా బయలుదేరనున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ మైదానంలో కసరత్తులు చేస్తున్నాడు. ‘తిరిగి మైదానంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఈ సెషన్ కాస్త కష్టంగానే గడిచింది. ముందుకు కొనసాగుతాను’ అని పేర్కొన్న వార్నర్ తాను ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోను పంచుకున్నాడు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. కాగా, కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 గ్లోబల్ లీగ్‌లో పాల్గొనేందుకు వార్నర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో వార‍్నర్ ప్రాక్టీస్‌ను షురూ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment