Husband and His Lover Got Arrested in Delhi Teacher Murder Case - Sakshi
Sakshi News home page

ప్రియురాలితో కలిసి భర్తే చంపించాడు

Published Fri, Nov 2 2018 11:42 AM | Last Updated on Fri, Nov 2 2018 1:04 PM

Delhi Teacher Murder Case Two Arrested - Sakshi

ఏంజెల్‌ గుప్తా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : వాయువ్య ఢిల్లీలో కలకలం రేపిన స్కూలు టీచర్‌ హత్య కేసును ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన సునీత(38), మంజీత్‌(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాగా మంజీత్‌.. ఏంజెల్‌ గుప్తా అనే మోడల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా సునీత అడ్డు తొలగించుకోవాలని భావించిన మంజీత్‌ ప్రియురాలితో కలిసి పథకం రచించాడు. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చాడు.

ఈ క్రమంలో స్కూలు టీచరుగా పనిచేస్తున్న సునీత.. సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న సమయంలో దుండగులు ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతిచెందారు. కాగా ఈ కేసులో మంజీత్‌, అతడి ప్రియురాలు ఏంజెల్‌ గుప్తాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పరారీలో ఉన్న కిరాయి హంతకుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement