ఆశిష్ మెరిసినా గెలవని శ్రీచైతన్య | Ashish has never won a shiny sricaitanya | Sakshi
Sakshi News home page

ఆశిష్ మెరిసినా గెలవని శ్రీచైతన్య

Published Thu, Aug 22 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Ashish has never won a shiny sricaitanya

సాక్షి, హైదరాబాద్: ఆశిష్ (5/56) అద్భుత బౌలింగ్‌తో రాణించినా శ్రీచైతన్య జట్టు బ్యాటింగ్ వైఫల్యంతో కంగుతింది. కోకాకోలా అండర్-16 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. ఆశిష్ ధాటికి జట్టులో ఒక్క రాజశేఖర్ రెడ్డి (84) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీచైతన్య టెక్నో స్కూల్ 5 వికెట్లకు 146 పరుగులే చేసింది. యశ్ కపాడియా 36 పరుగులు చేశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఆదిలాబాద్: 166 (సైఫ్ 50, అరుణ్ 60), లిటిల్ ఫ్లవర్ జేసీ: 114 (కార్తీక్ 3/15)
 జాన్సన్ గ్రామర్ స్కూల్: 131/7 (సన్నీ 37, హర్ష 32 నాటౌట్; దుర్గేశ్ 3/32), సెయింట్ మేరీస్ జేసీ: 145/4 (రుత్విక్ 78 నాటౌట్, భవిక్ త్రివేది 37; తరుణ్ 4/35)
  వెస్లీ జేసీ: 270/6 (వినీత్ 108, శ్రీనాథ్ 50), సెయింట్ జాన్స్ జేసీ: 272/5 (నికిల్ జైస్వాల్ 100, శిరీశ్ 70, నికిల్ పార్వాణి 47 నాటౌట్; చందన్ సహాని 3/68).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement