inter school cricket
-
చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్
Mumbai Indians Junior Inter-School tournament: ముంబై ఇండియన్స్ జూనియర్ ఇంటర్-స్కూల్ (అండర్-14) క్రికెట్ టోర్నమెంట్లో 13 ఏళ్ల యష్ చావ్డే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో సరస్వతీ విద్యాలయ తరపున బరిలోకి దిగిన యష్.. 178 బంతుల్లో ఏకంగా 508 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కేవలం 40 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లోనే యష్ వీరబాదుడు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 81 ఫోర్లు, 18 సిక్స్‌లు ఉన్నాయి. నాగ్‌పూర్‌లోని జులేలాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్లో సిద్ధేశ్వర్ విద్యాలయతో జరిగిన మ్యాచ్‌లో యష్ ఈ విధ్వంసం సృష్టించాడు. ఇక యష్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా సరస్వతీ విద్యాలయ నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 714 రన్స్ చేసింది. చావ్డేతో పాటు బరిలోకి దిగిన మరో ఓపెనర్ తిలక్ వాకోడే 97 బంతుల్లో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక 714 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధేశ్వర్ విద్యాలయ 9 పరుగులకే ఆలౌట్ కావడం గమానార్హం. తొలి భారత క్రికెటర్‌గా భారత్‌లో ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా చావ్డే నిలిచాడు. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో 500కు పైగా రన్స్ సాధించిన రెండో క్రికెటర్‌గా చావ్డే రికార్డులకెక్కాడు. తొలి స్థానంలో శ్రీలంకకు చెందిన చిరత్ సెల్లెపెరుమ 553 పరుగులతో ఉన్నాడు. మొత్తంగా ఆల్ఫార్మాట్లలో అన్ని వయసుల వారిలో 500కు పైగా పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా చావ్డే రికార్డు సాధించాడు.. చదవండి: 'సూర్యను చూస్తుంటే సర్ వివియన్ రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు' -
విజేత ఆల్‌సెయింట్స్
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఆల్సెరుుంట్స్ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్‌సెయింట్స్ జట్టు 79 పరుగుల తేడాతో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆల్‌సెయింట్స్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పి. శివ (78) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. జఫర్ (37 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రణవ్ వర్మ 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌ను అద్భుతమైన బౌలింగ్‌తో శివ (5/13)కట్టడి చేశాడు. శివ ధాటికి ఆ జట్టు 33 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ప్రణవ్ వర్మ (27), రోహిత్ రెడ్డి (23) పర్వాలేదనిపించారు. ఈ టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శివకు ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ పురస్కారాలు లభించగా... హెచ్‌పీఎస్, రామాంతపూర్ జట్టు బౌలర్ దుర్గబాలాజీకి ‘బెస్ట్ బౌలర్’ అవార్డు దక్కింది. -
'ఆ కుర్రాడి విద్యా, కోచింగ్ ఖర్చులు ప్రభుత్వానివే'
ముంబై:ఇంటర్ స్కూల్ టోర్నీలో వెయ్యి పరుగులకు పైగా సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేకు చేయూతనిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇక నుంచి ప్రణవ్ కు అయ్యే విద్యా, క్రికెట్ కోచింగ్ ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావేదే ఆ కుర్రాడి ప్రతిభను కొనియాడుతూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ' ప్రణవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇది రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణం. అందుచేత ఆ 15 ఏళ్ల యువకుడికి నాణ్యమైన క్రికెట్ కోచింగ్ ఇప్పించడంతో పాటు, విద్యాపరమైన ఖర్చులను మహారాష్ట్ర సర్కారే భరాయించాలని నిర్ణయించింది 'అని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆటో డ్రైవర్ అయిన ఆ కుర్రాడి తండ్రిని వినోద్ తావేదే కలిసి అభినందించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన కల్యాణ్ లో ఉన్న కేసీ గాంధీ స్కూల్లో ప్రణవ్ 10 వ తరగతి చదువుతున్నాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో ఆ స్కూల్ తరపున బరిలోకి దిగిన ప్రణవ్.. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన న మ్యాచ్‌లో 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు.సుమారుగా 395 నిమిషాల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఉన్న ప్రణవ్ 312.38 స్ట్రైక్ రేట్ తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. అంతకుముందు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉన్న 116 సంవత్సరాల ప్రపంచ రికార్డు చెరిగిపోవడమే కాకుండా, 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. -
ఆశిష్ మెరిసినా గెలవని శ్రీచైతన్య
సాక్షి, హైదరాబాద్: ఆశిష్ (5/56) అద్భుత బౌలింగ్‌తో రాణించినా శ్రీచైతన్య జట్టు బ్యాటింగ్ వైఫల్యంతో కంగుతింది. కోకాకోలా అండర్-16 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. ఆశిష్ ధాటికి జట్టులో ఒక్క రాజశేఖర్ రెడ్డి (84) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీచైతన్య టెక్నో స్కూల్ 5 వికెట్లకు 146 పరుగులే చేసింది. యశ్ కపాడియా 36 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆదిలాబాద్: 166 (సైఫ్ 50, అరుణ్ 60), లిటిల్ ఫ్లవర్ జేసీ: 114 (కార్తీక్ 3/15) జాన్సన్ గ్రామర్ స్కూల్: 131/7 (సన్నీ 37, హర్ష 32 నాటౌట్; దుర్గేశ్ 3/32), సెయింట్ మేరీస్ జేసీ: 145/4 (రుత్విక్ 78 నాటౌట్, భవిక్ త్రివేది 37; తరుణ్ 4/35) వెస్లీ జేసీ: 270/6 (వినీత్ 108, శ్రీనాథ్ 50), సెయింట్ జాన్స్ జేసీ: 272/5 (నికిల్ జైస్వాల్ 100, శిరీశ్ 70, నికిల్ పార్వాణి 47 నాటౌట్; చందన్ సహాని 3/68).