Mumbai Indians Junior Inter-School tournament: ముంబై ఇండియన్స్ జూనియర్ ఇంటర్-స్కూల్ (అండర్-14) క్రికెట్ టోర్నమెంట్‌లో 13 ఏళ్ల యష్ చావ్డే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో సరస్వతీ విద్యాలయ తరపున బరిలోకి దిగిన యష్.. 178 బంతుల్లో ఏకంగా 508 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
కేవలం 40 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లోనే యష్ వీరబాదుడు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 81 ఫోర్లు, 18 సిక్స్‌లు ఉన్నాయి. నాగ్‌పూర్‌లోని జులేలాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్‌లో సిద్ధేశ్వర్ విద్యాలయతో జరిగిన మ్యాచ్‌లో యష్ ఈ విధ్వంసం సృష్టించాడు.
ఇక యష్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా సరస్వతీ విద్యాలయ నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 714 రన్స్ చేసింది. చావ్డేతో పాటు బరిలోకి దిగిన మరో ఓపెనర్ తిలక్ వాకోడే 97 బంతుల్లో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక 714 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధేశ్వర్ విద్యాలయ 9 పరుగులకే ఆలౌట్ కావడం గమానార్హం.
తొలి భారత క్రికెటర్‌గా
భారత్‌లో ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా చావ్డే నిలిచాడు. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 500కు పైగా రన్స్ సాధించిన రెండో క్రికెటర్‌గా చావ్డే రికార్డులకెక్కాడు. తొలి స్థానంలో శ్రీలంకకు చెందిన చిరత్ సెల్లెపెరుమ 553 పరుగులతో ఉన్నాడు. మొత్తంగా ఆల్‌ఫార్మాట్లలో అన్ని వయసుల వారిలో 500కు పైగా పరుగులు చేసిన పదో బ్యాటర్‌గా చావ్డే రికార్డు సాధించాడు..
చదవండి: 'సూర్యను చూస్తుంటే సర్ వివియన్ రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment