
కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టిన నిర్వాసితులు
సాక్షి, యాదాద్రి: పరిహారం కోసం వెయ్యి మంది రైతులు రోడ్డెక్కారు. పాదయాత్రగా వచ్చి అధికారులకు మొర పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వా పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ రైతులు, ప్రజలు 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రాజెక్టులో మునిగిపోతున్న భూములకు, ఇళ్లకు పరిహారం, పునరావాసం, రిహాబిలిటే షన్ అండ్ రీసెటిల్‌మెంట్(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ డబ్బు లను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment