వలిగొండ: రాష్ట్రంలో మొత్తం లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. 80 వేలు మాత్రమే భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారని, మిగిలిన లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వెంటనే 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి వద్ద నిరుద్యోగ దీక్ష నిర్వహించారు.
దీక్షానంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ పాలనలో మూడు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని, 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలను సృష్టించారని, పేదలకు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment