మోటకొండూర్: తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగ సమస్య పెరిగిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వ కుండా కాలయాపన చేయటంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తంచేశారు.
మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూర్ మండలం ఆరెగూడెం, గిరిబోయినగూడెం మీదుగా పాదయాత్ర నిర్వహించిన షర్మిల.. మోటకొండూర్ మండల కేంద్రానికి చేరుకుని ఉద్యోగ దీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎంతో మంది నిరుద్యో గులు కేసీఆర్ పేరు రాసి చనిపోయారని కానీ, ముఖ్యమంత్రిలో చలనం రాకపోవటం దురదృ ష్టకరమన్నారు. చనిపోయిన నిరుద్యోగుల కుటుం బాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment